డేటా చోరీ : బాబుపై పీఎస్‌లో కంప్లయింట్

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 07:56 AM IST
డేటా చోరీ : బాబుపై పీఎస్‌లో కంప్లయింట్

Updated On : March 8, 2019 / 7:56 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ లీడర్ దినేష్ చౌదరి కంప్లయింట్ చేశారు. మార్చి 08వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. డేటా థెప్ట్‌పై ఐటీ గ్రిడ్‌పై నమోదైన కేసుపై విచారణనను ఎదుర్కొనలేక తెలంగాణ ప్రభుత్వంపై బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్‌తో బాబు పోల్చాడని, దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా జీవిస్తుంటే వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని తెలిపారు. వెంటనే బాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. 
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్

గత కొద్ది రోజులుగా ఇరు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ డేటా చోరీ సంచలనం రేకేత్తిస్తోంది. దీనిపై కంప్లయింట్ రావడంతో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయడం..దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడం..విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తుండడంతో టి.ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. ఐజీ స్టీఫెన్ రవీంద్రతో 9మంది బృందం ఈ కేసును దర్యాప్త చేపడుతోంది. తమ డేటాపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు లేదని పేర్కొన్న ఏపీ సీఎం బాబు పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరకు ఏపీ ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. ఇది ఇంకా ఎలాంటి ప్రకంపనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2