భట్టితో KTR భేటీ : పద్మారావుకి మద్దతు ఇవ్వండి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎల్పీ నేత అయిన భట్టీ విక్రమార్కతో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ భేటి అయ్యారు. డిప్యూటి స్పీకర్ గా పద్మారావును ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న టీఆరెస్ అధిష్టానం ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా తుది నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటిఆర్ శనివారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు.
ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామంటూ భట్టి తెలిపారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థి పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
Read Also: నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ
Read Also: పచ్చి అబద్దాలు చెప్పారు : అసెంబ్లీలో శ్రీధర్ బాబుపై కేసీఆర్ ఆగ్రహం
Read Also: సక్కగా వెళ్లటం లేదా : హైదరాబాదీలు కట్టాల్సిన ట్రాఫిక్ ఫైన్స్ రూ.63 కోట్లు