ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల న్యాయవాది కోరారు. సమ్మె ఎందుకు చేయాల్సి వస్తుందనే దానిపై సంఘాలు వివరణనిచ్చాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..విచారణనను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
అంతకుముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నం కార్మికులు చేయడం లేదని, చాలాసార్లు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందని కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. ఇవ్వాల్సిన సబ్సిడీ, రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు, ఇతరత్రా వాటిని పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే..కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని చెప్పారు.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తరపున అడ్వకేట్ వాదించారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా..వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు. గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే..కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. అక్టోబర్ 15వ తేదీన కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో చూడాలి.
Read More : హైకోర్టులో ఆర్టీసీ సమ్మె సీన్ : కొనసాగుతున్న వాదనలు