ఓవర్ నైట్‌లో విలీనం సాధ్యమేనా : ఆర్టీసీ సమ్మె విచారణ..వాయిదా

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 11:08 AM IST
ఓవర్ నైట్‌లో విలీనం సాధ్యమేనా : ఆర్టీసీ సమ్మె విచారణ..వాయిదా

Updated On : October 28, 2019 / 11:08 AM IST

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అక్టోబర్ 29వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30గంటలకు విచారణ చేపట్టనుంది. ఎల్లుండికి గడువు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కోర్టు నో చెప్పింది. విచారణ సందర్భంగా ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓవర్ నైట్‌లో విలీనం సాధ్యమేనా అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరువర్గాల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ వెంటనే రావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున ఏజీ మాత్రమే వాదనలు వినిపించాలని సూచించింది. కోర్టుకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేరుకున్నారు. కార్మిక సంఘాల తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదించారు. 

ఒక్క డిమాండ్‌పై పట్టుబట్టకుండా..మిగతా డిమాండ్లపై చర్చించొచ్చు కదా అని విలీనం డిమాండ్ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించాలని కోర్టు సూచించింది. ఈడీల కమిటీ నివేదికను సమర్పించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మిక సంఘాలతో చర్చలపై అదనపు కౌంటర్ దాఖలు చేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు.

కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే..వినలేదని కార్మిక సంఘాల నేతలు చర్చించకుండా వెళ్లిపాయరని వాదించారు. ఆర్టీసీ ప్రస్తుతం రూ. 4 వేల 709 కోట్ల అప్పుల్లో ఉందని, ప్రతి ఏడాది రూ. 1200 కోట్ల నష్టంలో ఉందన్నారు. 2019-2020 ఏడాదికి రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర రూ. 10 కోట్ల నిల్వలు ఉన్నాయన్నారు. 

చర్చల విషయంలో హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని, కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారని..ఇతర డిమాండ్లపై వారు చర్చించడం లేదని వెల్లడించారు. 
Read More : ఆర్టీసీ సమ్మె : మహిళా కండక్టర్ ఆత్మహత్య