గుడ్ న్యూస్ : ఎక్కడైనా కరెంటు బిల్లు కట్టొచ్చు

హైదరాబాద్ : కరెంటు బిల్లులు ఇక ఎక్కడైనా కట్టొచ్చు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని బిల్లులను ఏ విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలోనైనా చెల్లించొచ్చని..అధికారులు వెల్లడించారు. కరెంటు కనెక్షన్ ఉన్నచోట ఈఆర్ఐ మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉండేది. తాజాగా ఎస్పీడీసీఎల్ తమ పరిధిలోని 71 ఈఆర్ఓ కార్యాలయాలను ఆన్ లైన్‌తో అనుసంధానం చేసింది.
ఎవరైనా ఎక్కడైనా బిల్లులకు డబ్బులు చెల్లించవచ్చని…బిల్లు తీసుకెళ్లాల్సినవసరం కూడా లేదని అధికారులు ప్రకటించారు. యునిక్ సర్వీస్ కనెక్షన్ సంఖ్యను చెబితే సరిపోతుందని తెలిపారు. దక్షిణ డిస్కం పరిధిలో 70 లక్షల మందికిపైగా గృహ వినియోగదారులున్నారని..మెరుగైన సేవలందించేందుకు ఈ సంస్కరణ తెచ్చినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.