ఈ సమీక్ష ముందే చేసుంటే విద్యార్థులు బతికేవారుగా : విజయశాంతి

తెలంగాణ ఇంటర్మీడియట్ జరిగిన ఘోరమైన అవకతవకలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. బుధవారం (ఏప్రిల్ 24) ఓ ప్రకటనలో భాగంగా ఇంటర్ బోర్డ్ నిర్వాకంపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపిన అంశంపై విజయశాంతి మాట్లాడుతు.. ఈ సమీక్ష ఏదో ముందే చేసుంటే 19 మంది విద్యార్థులు బతికి ఉండేవారనీ..వారి భవిష్యత్తుని తెలంగాణ ప్రభుత్వం చేతులారా చిదిమేసిందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్ బోర్డ్ చేసిన ఘోర తప్పిదాలను నుంచి తప్పించుకోవాలని యత్నించటం..తమకు జరిగిన అన్యాయంపై అడగటానికి వచ్చిన విద్యార్థులు..వారి తల్లిదండ్రులతో అధికారులు దురుసుగా ప్రవర్తించటం ఇష్టానుసారం మాట్లాడటం సిగ్గుచేటని విజయశాంతి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులు విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16మంది చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 24,2019) మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు.
కాగా విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్ నేత రాములు నాయక్ ఆరోపించారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద డిమాండ్ చేశారు. 18 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకోవటానికి కారణమైన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా అధికారులను.. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ ఆరోపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న జిల్లాల కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
కాగా తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన ఇంటర్ ఫలితాల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో బుధవారం (ఏప్రిల్ 24) సమీక్షా సమావేశం నిర్వహించారు. అంటే ఫలితాలు వెలువడిన ఆరు రోజులకు రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఇన్ని రోజులకు సమీక్ష నిర్వహించటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘కేసీఆర్ ప్రభుత్వానికి చెలగాటం.. ఇంటర్ విద్యార్ధులకు ప్రాణ సంకటం అన్న విధంగా మారింది తెలంగాణలో పరిస్ధితి. కాసుల కోసం క్కకుర్తి పడి…ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ ప్రభుత్వం అమాయకులైన విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంది’ అని ట్విట్టర్ వేదికగా 22న విజయశాంతి విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి చెలగాటం…ఇంటర్ విద్యార్ధులకు ప్రాణ సంకటం అన్న విధంగా మారింది తెలంగాణలో పరిస్ధితి. కాసుల కోసం క్కకుర్తి పడి…ఇంటర్ బోర్డు పరీక్షలను నిర్వహించడానికి అర్హత లేని ఓ అనామక కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పి, కేసీఆర్ ప్రభుత్వం అమాయకులైన విద్యర్ధుల జీవితాలతో ఆడుకుంది. pic.twitter.com/Jks2fKOykG
— VijayashanthiOfficial (@vijayashanthi_m) April 22, 2019