మండుతున్న ఎండలు : బయ్యారంలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్ : తెలంగాణలో ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 25 సోమవారం 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడూళ్ల బయ్యారంలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సిద్దిపేట జిల్లాలోని ముస్త్యాలలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్ లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది.