ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ అమరావతి టూర్ అప్పుడేనా

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 03:26 AM IST
ఫెడరల్ ఫ్రంట్ : కేసీఆర్ అమరావతి టూర్ అప్పుడేనా

Updated On : January 18, 2019 / 3:26 AM IST

హైదరాబాద్ : ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందుకెళుతున్న కేసీఆర్ ఆదేశాలతో…ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌తో కేటీఆర్ బృందం భేటీ కావడం అక్కడి రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. త్వరలోనే జగన్‌తో సీఎం కేసీఆర్ స్వయంగా భేటీ అయి…ఫ్రంట్‌పై సుదీర్ఘంగా చర్చిస్తారని కేటీఆర్ వెల్లడించడంతో అందరి దృష్టి కేసీఆర్ టూర్‌పై ఉంది. అయితే..గులాబీ బాస్ అమరావతికి ఎప్పుడు వెళుతారు ? అనే దానిపై హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు వెళుతారో సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. 
జగన్ గృహప్రవేశం…
ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా ఇళ్లు కట్టుకున్నారు. దీనికి ముహూర్తం 2019, ఫిబ్రవరి 14 నిర్ణయించారు. తమ గృహ ప్రవేశానికి రావాలని పలువురిని జగన్ ఫ్యామిలీ ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా ఆహ్వానం పలకాలని జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్. చర్చల మధ్యలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు..జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక్కడే తన గృహ ప్రవేశానికి రావాలని జగన్ ఆహ్వానం పలికినట్లు…దీనికి కేసీఆర్ ఒకే అన్నట్లు సమాచారం. అలాగే తాను ఫిబ్రవరి 21న నిర్వహించే సహస్ర చండీయాగానికి రావాలని కేసీఆర్..జగన్‌ని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. సో…కేసీఆర్ టూర్ అప్పుడేనా ? అనేది తెలియాలంటే కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.