BJP-Congress: ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందిస్తూ... ‘‘భారతీయులందరికీ ఓ విషయం గుర్తు చేస్తున్నాను. నిబంధనలను ఒప్పుకోవాలని భారత ప్రభుత్వంపై ఫైజర్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. అదే విధంగా, కరోనా విజృంభణ సమయంలో కాంగ్రెస్ త్రయం రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాం రమేశ్ కూడా విదేశీ వ్యాక్సిన్లను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసేవారు’’ అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. దీనిపై జైరాం రమేశ్ స్పందించారు. ఇది మొత్తం తప్పుడు సమాచారం మిస్టర్ మినిస్టర్ అని ఆయన అన్నారు.

BJP-Congress: ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

BJP-Congress

Updated On : January 21, 2023 / 9:36 AM IST

BJP-Congress: వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో తాజాగా పాల్గొన్న ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లాను జర్నలిస్టులు నిలదీశారు. ఈ వీడియోను కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ పోస్ట్ చేశారు.

ఫైజర్ వ్యాక్సిన్ విషయంలో ఆల్బర్ట్ బౌర్లా అసత్యాలు చెప్పారని, అది సమర్థంగా పనిచేస్తుందని అన్నారని, అయితే అది అంతగా పనిచేయలేదని జర్నలిస్టులు అన్నారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అయితే, ఫైజర్ సీఈవో సమాధానం చెప్పలేకపోయారు. ఆయన మౌనంగా వెళ్లిపోయారు.

ఈ విషయంపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందిస్తూ… ‘‘భారతీయులందరికీ ఓ విషయం గుర్తు చేస్తున్నాను. నిబంధనలను ఒప్పుకోవాలని భారత ప్రభుత్వంపై ఫైజర్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. అదే విధంగా, కరోనా విజృంభణ సమయంలో కాంగ్రెస్ త్రయం రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాం రమేశ్ కూడా విదేశీ వ్యాక్సిన్లను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసేవారు’’ అని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. దీనిపై జైరాం రమేశ్ స్పందించారు. ఇది మొత్తం తప్పుడు సమాచారం మిస్టర్ మినిస్టర్ అని ఆయన అన్నారు. మరిన్ని అసత్యాలను ప్రచారం చేయాలన్న లక్ష్యం పెట్టుకోకూడదంటూ ఎద్దేవా చేశారు.

New Parliament Building: నూతన పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసిన కేంద్రం .. ఓ లుక్కేయండి ..