Chief Justice of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్.. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ సిఫార్సు

భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్​ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కోరింది. దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ఆయన ప్రతిపాదించారు.

Chief Justice of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్.. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్‌ సిఫార్సు

Updated On : October 11, 2022 / 11:36 AM IST

Next Chief Justice of India: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. కొత్త సీజేఐ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. నవంబర్​ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేశ్ లలిత్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కోరింది.

దీంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ఆయన ప్రతిపాదించారు. 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనవాయితీ ప్రకారం అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సీజేఐ సిఫార్సు చేస్తారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది. కాగా, ఈ ఏడాది ఆగస్టు 27న సీజేఐగా జస్టిస్​ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 8న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..