Cambodia : క్యాసినో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..10మంది సజీవ దహనం, 30మందికి గాయాలు

డైమండ్ సిటీ హోటల్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 10 అంతస్థుల భవనంలో పై అంతస్తుల్లో ఉన్న  డైమండ్‌ సిటీ క్యాసినో హోటల్‌లో అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో 10మంది సజీవంగా దహనం అయిపోయారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో 30మంది తీవ్రంగా గాయపడ్డారు.

Cambodia : క్యాసినో హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..10మంది సజీవ దహనం, 30మందికి గాయాలు

10 Killed, 30 Injured' In Cambodia Hotel Casino

Updated On : December 29, 2022 / 12:38 PM IST

Cambodia : కాంబోడియాలోని పోయిపేట్‌ గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 10 అంతస్థుల భవనంలో పై అంతస్తుల్లో ఉన్న  డైమండ్‌ సిటీ క్యాసినో హోటల్‌లో బుధవారం (డిసెంబర్ 28,2022) అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో 10మంది సజీవంగా దహనం అయిపోయారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో దాదాపు 30మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్రమంగా భవనం అంతటా వ్యాపించాయి. ఈ మంటల్లో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

భవనంలో మంటలు చెలరేగటంతో క్యాసినో హోటల్లో తీవ్ర కలకలం రేగింది. మంటలనుంచి తప్పించుకోవటానికి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పలువురు కిటికీల నుంచి దూకేశారు.పై అంతస్థుల నుంచి దూకివేయటంతో 30మంది గాయపడ్డారు. మంటలు ఎగసిపడుతున్న భవనంపై నుంచి వ్యక్తులు దూకివేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ ప్రమాద ఘటన సమచారం అందుకోగానే అగ్నిమాపక సిబ్బంది తరలివచ్చారు.మంటలను అదుపులోకి తీసుకురావటానికి చాలా శ్రమించారు. సహాయక చర్యల్ని చేపట్టి దాదాపు 53మందిని రక్షించారు.