బాగ్లాన్ లో 10 మంది తాలిబన్లు హతం

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 09:38 AM IST
బాగ్లాన్ లో  10 మంది తాలిబన్లు హతం

Updated On : April 2, 2019 / 9:38 AM IST

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో 10 మంది తాలిబన్లను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. తాలిబన్లు ఉన్నరనే సమాచారంతో ఆదివారం (ఏప్రిల్ 2)కూబింగ్ చేపట్టిన  భద్రతాబలగాలకు ఎదురుపడ్డారు తాలిబన్లు. దీంతో తాలిబన్లకు…సైనికులకు మధ్య హోరా హోరీగా ఎదురు కాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ప్రముఖ తాలిబన్‌ కమాండర్‌ ముల్లాహ్‌ మనన్‌ సహా 10 మంది తాలిబన్లు మృతి హతమయ్యారు. ఈ క్రమంలో  బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో తాలిబన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికార ప్రతినిధి మహ్మద్‌ హనీఫ్‌ రిజై అధికారికంగా ప్రకటించారు. ఈ  ఘటనపై ఇప్పటి వరకు తాలిబన్లు స్పందించలేదు.
 

2018లో తాలిబన్ల ఘాతుకం..
2018 ఆగస్టులో ఆఫ్ఘన్‌ ఉత్తర ప్రాంతంలో సాధారణ ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులపై దాడికి తెగబడి పలువురు మహిళలు, చిన్నారులతో సహా దాదాపు 100 మందిని తమ నిర్బంధించారు. ఆఫ్ఘన్ లోని జిల్లాలకు జిల్లాలే తమ ఆధీనంలోకి తీసుకుంటూ, భారీయెత్తున బాంబు దాడులు, సాయుధ దాడులకు పాల్పడుతూ అనేక మందిని హతమారుస్తున్నారు. అలాగే 2018 నవంబర్ లో ఆఫ్ఘన్ లోని  ఫరా ప్రావిన్స్‌లో తాలిబన్లు జరిపిన పోలీసులపై పాల్పడిన దాడిలో 30 మంది పోలీసులు మృతి చెందారు. ఇలా ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఈ క్రమంలో తాలిబన్లను మట్టుపెట్టేందుకు చేపట్టిన కూబింగ్ లో భద్రతా దళాలు 10మంది తాలిబన్లను హతమార్చటం జరగింది.