Pakistan : Pakistan : వీళ్ల దుంపతెగ.. పెళ్లి చేస్తేనే చదువుకుంటామన్నారట.. 12 ఏళ్ల పిల్లలకు నిశ్చితార్థం చేసిన పెద్దలు

వరుడుకి 13.. వధువుకి 12..పెళ్లి చేస్తేనే చదువుకుంటామన్నారట. ఏంటి? షాకయ్యారా? వాళ్ల పేరెంట్స్ మాత్రం గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసేసారు. ఇంతకీ ఈ తంతు ఎక్కడ జరిగిందంటే?

Pakistan : Pakistan : వీళ్ల దుంపతెగ.. పెళ్లి చేస్తేనే చదువుకుంటామన్నారట.. 12 ఏళ్ల పిల్లలకు నిశ్చితార్థం చేసిన పెద్దలు

Pakistan

Pakistan : వరుడికి 13.. వధువుకి 12.. ఇటీవలే వీరికి నిశ్చితార్థం జరిగింది. బాల్య వివాహం చట్టరీత్యా నేరం కదా? ఇంతకీ ఈ జంట ఎక్కడివారు? అంటే..పాకిస్తాన్‌కి చెందిన జంటకు వారి తల్లిదండ్రులే  నిశ్చితార్థం జరిపించడం మరీ షాకింగ్. వివరాల్లోకి వెళ్తే..

కోహ్లికి కొడుకు పుట్టాడ‌ని తెలిసి.. పాకిస్తాన్‌లో ఏం చేశారో తెలుసా?

పాకిస్తాన్‌లో చట్టబద్ధంగా వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ఆడవారికి 16 సంవత్సరాలు..కాగా 13 ఏళ్ల బాలుడు మహ్మద్ కాజ్.. 12 ఏళ్ల బాలిక అలీజే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఓ వైపు పెళ్లికి చట్టబద్ధమైన పరిమితులు ఉండటంతో పాటు ఈ కేసు బాల్య వివాహాల సమస్యను హైలైట్ చేసింది. తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే వరుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తేనే తన చదువుని కొనసాగిస్తానని అల్టిమేటం జారీ చేసాట్ట.. ఇక పట్టు వీడట్లేదని ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్థం చేశారు.

Kurchi Madathapetti song : ‘కుర్చీ మ‌డ‌తపెట్టి’ పాటకి జపాన్ జంట.. తమ స్టెప్పులతో ఇచ్చిపడేశారు..

వరుడు 6వ తరగతి చదువుతున్నాడు. వధువు 7వ తరగతి చదువుతోంది. ఇంత చిన్న వయసులో నిశ్చితార్థం చేసుకోవాలనే వీరి నిర్ణయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ జంట తల్లులకు కూడా 16 సంవత్సరాలకే పెళ్లైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మహ్మద్ కాజ్, అలీజే జంటకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. 18 సంవత్సరాలు రాగానే పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారట పెద్దలు. ఏది ఏమైనా పిల్లలు జారీ చేసిన అల్టిమేటంకి  పెద్దలు  ఒప్పుకోవడం ఏదైతే ఉందో ఇది మాత్రం ఈ స్టోరీలో హైలైట్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Salaam! Pakistan (@salaam_pakistan)