UK Zoo To Kenya : యూకే జూ నుంచి కెన్యాకు ఏనుగుల మంద తరలింపు..వేల కిలోమీటర్ల ప్రయాణం

ఒక ఏనుగు కాదు..రెండు ఏనుగులు కాదు..ఏకంగా 13 ఏనుగుల మందను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు. అది కూడా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతానికి ప్రయాణం చేయనున్నాయి.

UK Zoo To Kenya : యూకే జూ నుంచి కెన్యాకు ఏనుగుల మంద తరలింపు..వేల కిలోమీటర్ల ప్రయాణం

Elephant

Updated On : July 8, 2021 / 2:48 PM IST

13 Elephants from U.K. Zoo : ఒక ఏనుగు కాదు..రెండు ఏనుగులు కాదు..ఏకంగా 13 ఏనుగుల మందను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు. అది కూడా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతానికి ప్రయాణం చేయనున్నాయి. మందలో ఉన్న ఏనుగులు విడదీయడం ఇష్టంలేకే…13 ఏనుగుల మందను తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే మొదటి ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

UK జూ నుంచి కెన్యాకు 13 ఏనుగుల మందను తరలించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ప్రయత్నం ముందెన్నడూ జరగలేదని Aspinall Foundation, a wildlife conservation charity ప్రకటించింది. యునెటైడ్ కింగ్ డమ్ లో ఈ ఏనుగుల మంద ఉంటున్నాయి. ఇంగ్లాండ్ లోని కెంట్ లో ఉన్న Howletts Wild Animal Parkలో ఉన్న 13 ఆఫ్రికన్ ఏనుగులను 7 వేల కిలోమీటర్లు (4,349 మైళ్లు) తరలించనున్నట్లు The Aspinall Foundation వెబ్ సైట్ లో వెల్లడించింది.

ప్రపంచంలో ఏనుగుల మందను తరలించడం ఇదే ఫస్ట్ టైమ్ అని వెల్లడించింది. మందలో ఉన్న ఏనుగులను విడదీయడం ఇష్టంలేకే…వారంతా ఒక కుటుంబంగా భావించామని వెల్లడించింది. కెంట్ లో 8 ఎకరాల స్థలంలో ఉన్నాయని, జూలో మంచి సంరక్షణలో ఉన్నా…అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపింది. మొత్త ఏనుగుల మంద బరువు 25 టన్నులు ఉంటుందని, ప్రతి ఏనుగును తరలించేందుకు ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఐరోపా నుంచి ఏనుగుల మందను ఆఫ్రికాకు తరలించడం ఇదే మొదటిసారి అని, గత సంవత్సరం బందిఖానాలో ఉన్న రెండు చిరుతలను, సాబా, నైరోలను దక్షిణాఫ్రికాకు మరొక Aspinall ఫౌండేషన్ తీసుకొచ్చిందని సంస్థ వెల్లడించింది.