బలూచిస్థాన్‌లో ఘోరం :14 మందిని దారుణంగా చంపేశారు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 08:31 AM IST
బలూచిస్థాన్‌లో ఘోరం :14 మందిని దారుణంగా చంపేశారు

Updated On : April 18, 2019 / 8:31 AM IST

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోరం జరిగింది. నాలుగు బస్సులను నిలిపివేసి ప్రయాణీకులకు బలవంతంగా కిందకు దింపేశారు. అనంతరం వారిని ఘోరంగా చంపేశారు.  కరాచీలోని పోర్ట్‌ మెగాసిటీ నుంచి ఒర్మారాలోని తీర ప్రాంత పట్టణానికి వెళ్తున్న నాలుగు బస్సులను కొందరు దుండగులు ఆపివేశారు. అనంతరం వారిని వారి ఐడీ కార్డులు ఏవని అడిగారు. తరువాత  ప్రతి ప్రయాణికుడిని ఐడీ కార్డులు చూపించమన్నారు.

అనంతరం నాన్‌ – బలూచ్‌ ప్రయాణికులను కిందకు దించి 14 మందిని దారుణంగా హతమార్చారు. కాగా ఈ ఘోరానికి పాల్పడింది బలూచిస్థాన్‌ వేర్పాటువాదులే అని తెలుస్తోంది. 12 మందికిపైగా మిలటరీ దుస్తుల్లో వచ్చిన వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నౌకదళ అధికారులు, తీర ప్రాంత సిబ్బంది లక్ష్యంగా దాడి చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులతో పాటు వేర్పాటువాదులు అధిక సంఖ్యలో ఉన్నారు.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్