Nigeria : నైజీరియాలో ముష్కరుల దాడి..26 మంది సైనికుల మృతి, కూలిన హెలికాప్టర్
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిపోయింది....

Nigeria Troops Killed
Nigeria : నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో భద్రతా దళాలకు చెందిన 26 మంది సైనికులు మరణించారు. అర్థరాత్రి క్రిమినల్ గ్రూపు జరిపిన ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. మరో వైపు క్షతగాత్రులను రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూలిపోయింది. క్రిమినల్ గ్రూపు కాల్పుల కారణంగానే హెలికాప్టర్ కూలిపోయిందని నైజీరియా మిలటరీ వర్గాలు వెల్లడించాయి. (Nigeria Troops Killed)
Man Shot : షాకింగ్.. కూతురిని భుజాలపై మోసుకెళ్తున్న తండ్రి, ఇంతలో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి
గత కొంత కాలంగా నైజీరియా సైన్యం క్రిమినల్ గ్రూపుతో పోరాడుతోంది. ముష్కరుల దాడిలో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన ఎంఐ-171 హెలికాప్టర్ జుంగేరు నుంచి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయిందని మిలటరీ అధికారులు చెప్పారు. (Rescue Helicopter Crashes) ‘‘విమానం జుంగేరు ప్రాథమిక పాఠశాల నుంచి కడునాకు బయలుదేరింది, అయితే నైజర్ రాష్ట్రంలోని షిరోరో స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని చుకుబా విలేజ్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించాం’’ అని సైనిక ప్రతినిధి ఎడ్వర్డ్ గబ్క్వెట్ ఒక ప్రకటనలో తెలిపారు.
విమానంలో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు. నైజీరియాలో నైజర్, కడునా, జంఫారా, కట్సినా రాష్ట్రాల్లో అడవుల్లో క్రిమినల్ ముఠాలు శిబిరాలు నిర్వహిస్తూ దాడులు, కిడ్నాప్ లు చేస్తున్నారు. ఈ క్రిమినల్ గ్యాంగ్ ఈ సారి ఏకంగా నైజీరియా భద్రతాదళాలపై దాడి చేసింది.