2030నాటికి అమెరికాను చైనా దాటేయగలదా?

  • Published By: sreehari ,Published On : August 27, 2020 / 05:50 PM IST
2030నాటికి అమెరికాను చైనా దాటేయగలదా?

Updated On : August 27, 2020 / 7:12 PM IST

5 countries of armed forces : ఈ ప్రపంచంలో ఎక్కడకెళ్లినా అమెరికా సైన్యం కనిపిస్తుంది. ఒకేసారి నాలుగైదు చోట్ల దాడులు చేస్తుంది. టెర్రరిజంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తోంది. తన ఆయుధాలను ప్రయోగించి చూస్తోంది. ఇక్క చైనా నాలుగడుగులు వెనక్కు ఉంది. యుద్ధ అనుభవం లేదు.

అలాగని చైనాను తక్కువ చేయలేం. ఆర్దికంగా సూపర్ పవర్‌గా అవతరించిన డ్రాగన్ ఇప్పుడు సైనిక రంగంలోనూ నిప్పులు చిమ్మడానికి సిద్ధం. మరి అమెరికా తట్టుకొంటుందా? 2030నాటికి సైనికంగా ఏది సూపర్ పవర్?

2. అమెరికా :
యుద్ధానికి అమెరికా ఆర్మీ అంటే గోల్డ స్టాండర్డ్. 1991 వరకు అమెరికాకు తిరుగులేదు. 1991లో బట్టలు నలక్కుండానే ఇరాక్ ను ఓడించడం, 2003లో తాలిబాన్ పై హైటెక్ పోరు, అఫ్ఘనిస్థాన్ ధ్వంసం వంటివి అమెరికా సైనిక శక్తికి నిదర్శనాలు. సైనిక తెరపై అమెరికా చేసిన స్టంట్స్.

5 countries of armed forces will be strong by 2030, China will overcome US by this time?

15 ఏళ్లగా ఇరాక్, అఫ్ఘనిస్థాన్, ఇతర చోట్లా స్పెషల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. నేలమీద యుద్ధంలో అమెరికాకున్న అనుభవం ఏ దేశానికీ లేదు. అమెరికాది రెండంచెల వ్యూహం. ఒకపక్క యద్ధాలు చేస్తుంది. మరోపక్క సైన్యానికి కావాల్సిన అధునిక సాధన సంపత్తిని తయారుచేస్తుంది. Navy, Air Force, Marine Corpsలో పురోగతి కాస్త నెమ్మదించినా… వీటి పాత్రే ఎక్కువ.

అమెరికా అనగానే అదేదో మోడర్న్ మిలటరీ అనుకొంటాంకాని, ఇప్పటికీ కోల్డ్ వార్ నాటి వెపన్స్‌, టాంక్స్, మిస్సైల్స్‌ను వాడుతోంది. కాకపోతే చాలా ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించారు. ఇప్పుడు అమెరికా దగ్గర reconnaissance drones ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే మీటర్ కూడా గురితప్పకుండా మిస్సైల్స్ ప్రయోగించకలదు.

ఉగ్రవాదులను వేటాడే అనుభవముంది. 15ఏళ్లగా పోరాటం సాగుతూనే ఉంది. ఆధునిక చరిత్రలో ఏ దేశమూ ఇంతలా, చాలా ప్రాంతాల్లో ఒకేసారి దాడులను చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ లేదు. అందుకే 2030 నాటికీ దాడుల చేయడంలో అమెరికా కచ్చితంగా సూపర్ పవరే. దరిదాపుల్లో ఏ దేశమూ లేదు.

1.చైనా :
2030నాటికి ఆధునిక సైనిక వ్యవస్థలా మారాలన్నది చైనా పంతం. అనుకుంది సాధిస్తున్నట్లే కనిపిస్తోంది. 2023 నాటికి ఆయుధ సమీకరణ, ఆధునీకీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత నుంచి సూపర్ ఆర్మీగా తయారుకావడానికి ప్లాన్స్ రెడీ చేసింది. ఆసియా అంతా ఒకేసారి దాడిచేసినా తట్టుకొనే శక్తిని సాధించాలన్నది చైనా దీర్ఘకాలిక వ్యూహం.

1990ల నాటి నుంచి చైనా ఆర్మీ పూర్తిగా భూతల సైన్యాన్ని నవీకరించింది. ఇప్పుడు సొంత అవసరాలను తీర్చుకోవడమేకాదు, విదేశాలకు ఆయుధ వ్యవస్థలను ఎగుమతి చేస్తోంది. పాకిస్థాన్, రష్యాతో కలసి యుద్ధవిమానాలు, మిస్సైల్ సిస్టమ్స్‌ను తయారుచేస్తోంది. వాటినీ ఎక్స్‌పోర్ట్ చేస్తోంది.

1990లు, 2000ల్లో చైనా ఆర్ధికంగా సూపర్ పవర్‌గా ఎదిగేసరికి, సంపద వచ్చింది. సైన్యాన్ని ఆధునీకీకరించడానికి, ఆయుధ సంపత్తిని తయారు చేసుకోవడానికి నిధులు దండిగా వచ్చాయి. అందుకే innovative technology sectorకి మీద పెట్టుబడి పెట్టింది. సైనికుల సంఖ్యను తగ్గించి… మోడర్న్ మిలటరీ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దుతోంది.

5 countries of armed forces will be strong by 2030, China will overcome US by this time?

అమెరికా నుంచి చైనా బాగా నేర్చుకుంది. అగ్రరాజ్యం ఏ దేశంలో సైన్యాన్ని ఉంచినా ఖర్చులన్నీ ఆ దేశం నెత్తిమీద వేస్తుంది. దాని వల్ల ఆధునిక సైన్యాన్ని తయారుచేయడానికి అమెరికాకు అవకాశం చిక్కింది. ఇప్పుడు చైనా కూడా అలాగే ఆలోచిస్తోంది.

మిత్రదేశాల రక్షణ బాధ్యతను తను తీసుకొని, సైనిక ఖర్చును తగ్గించుకోవాలని అనుకొంటోంది. ఇక్కడే చైనా కొంత దూకుడిగా వ్యవహరించింది. ఎయిర్ ఫోర్స్, నేవీని పక్కనపెట్టి సైన్యంమీదనే ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ రెండింటికి ప్రాధాన్యతనిచ్చింది.

ఇప్పుడు equipment modernization projects, realistic trainingమీద చైనా మనసుపెట్టింది. ఇదంతా సైన్యాన్ని ప్రొఫెషనల్ , మోడర్న్ వార్‌ఫేర్‌లో సూపర్ ఆర్మీగా తీర్చిదిద్దడానికే.అమెరికాకున్నంత నిధుల దన్ను చైనాకు లేదు.

కాని, ఎంతమంది కావాలంటే అంత సైన్యం, వనరుల మీద కంట్రోల్ చైనాకుంది. ఇదే చైనాకున్న గొప్ప అవకాశం. సమస్యంతా అమెరికాలాగా ముఖాముఖి తలపడిన అనుభవం అస్సలు లేదు. కనీసం ఇండియాకున్నంత అవగాహన, అనుభవమూ లేదు. Sino-Vietnamese War ఆఖరిది.

Part-2 : 2030 నాటికి ఈ 5 దేశాల సైన్యాలకు తిరుగుండదు. ఇండియా స్థానమెక్కడ?