కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..

  • Published By: vamsi ,Published On : February 15, 2020 / 05:12 AM IST
కరోనా మరణ శాసనం: మరో 143మంది మృతి.. ఒడిశాలో 74మందిపై..

Updated On : February 15, 2020 / 5:12 AM IST

కరోనా(కొవిడ్‌-19) వైరస్ మహమ్మారి మరణ శాసనాలను లిఖిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,523కు చేరుకోగా.. లేటెస్ట్‌గా శుక్రవారం ఒక్కరోజే 143మందిచ చనిపోయినట్లు వెల్లడించారు చైనాకు చెందిన అధికారులు. మృతుల్లో 139 మంది వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారు. 

ఇక ఇప్పటివరకు ఖరారైన కరోనా కేసులు 66వేలకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మహమ్మారితో బాధపడుతున్న వారి సంఖ్య 66,492కు చేరుకుంది. హుబెయ్‌ మినహా మిగతా రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య క్రమంగా పడిపోతున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ని కట్టడి చేయడానికి అత్యాధునిక బిగ్‌ డేటా, కృత్రిమ మేధ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి సాంకేతికతను వినియోగించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు.

ఇక చైనా సహా కరోనా(కొవిడ్‌-19) వైరస్ భారిన పడిన ఇతర దేశాల నుంచి వచ్చిన.. దాదాపు 74మందిని ఒడిశా ప్రభుత్వం ఇళ్లకే పరిమితం చేసింది. వీరంతా జనవరి 15 తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన వారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Read  More>>కరోనాను ఎదుర్కోవాలని 66కిలోమీటర్లు పరిగెత్తాడు,అప్పటివరకు 3జీ, 4జీ సేవలు బంద్,బొత్స లీకులు ఇస్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నారా?.