అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.

ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులను అరెస్టు చేశారు. ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. డెట్రాయిట్ లోని ఫార్మింగ్ టన్ ఫేక్ యూనివర్శిటీని మూసివేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అందులో చేరిన 250 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో 90 మంది భారతీయ విద్యార్థులున్నారని తేలింది. విద్యార్థుల అరెస్ట్ తో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్ నేతలు అభివర్ణిస్తున్నారు.
గత మార్చి నెలలో యూనివర్సిటీలో 161 మంది అరెస్టు చేశారు. ఆ వర్సిటీని మూసివేసే సమయానికి అందులో 600 విద్యార్థులు చదువుతున్నట్లు తెలిసిందే. దీనిలో ఎక్కువ శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు.