Indian Woman: 75 ఏళ్ల తర్వాత పాక్‌లోని ఇంటికి వెళ్లొచ్చిన భారత మహిళ

పాకిస్తాన్‌లోని తన పురాతన ఇంటిని 75ఏళ్ల తర్వాత తిరిగి చూసేందుకు అక్కడికి వెళ్లొచ్చారు 92 ఏళ్ల మహిళ. స్థానిక మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్ హై కమిషన్ మహిళకు మూడు నెలల వీసాకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది.

Indian Woman: 75 ఏళ్ల తర్వాత పాక్‌లోని ఇంటికి వెళ్లొచ్చిన భారత మహిళ

India Pakistan

Updated On : July 17, 2022 / 4:15 PM IST

 

 

Indian Woman: పాకిస్తాన్‌లోని తన పురాతన ఇంటిని 75ఏళ్ల తర్వాత తిరిగి చూసేందుకు అక్కడికి వెళ్లొచ్చారు 92 ఏళ్ల మహిళ. స్థానిక మీడియా కథనం ప్రకారం.. పాకిస్తాన్ హై కమిషన్ మహిళకు మూడు నెలల వీసాకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో రీనా చిబార్ చాలా సంతోషపడిపోతున్నాననే అభిప్రాయం వ్యక్తం చేసింది.

వాగా-అత్తారీ బోర్డర్‌ నుంచి వెళ్లి పాకిస్తాన్‌ రావాల్పిండిలోని ప్రేమ్ నివాస్‌ ప్రాంతంలోని తన పురాతన ఇంటికి మహిళ శనివారం వెళ్లారు. రిక్వెస్టులతో ఇరుదేశాలు కలిసి వీసా మంజూరు చేయడంతో ఇంటికి వెళ్లడం తిరిగి రావడం ఈజీ అయిపోయిందని ఆమె అన్నారు. ఇరుదేశాలు విడిపోక ముందు రావల్పిండి ప్రాంతంలో అప్పటి వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు రీనా.

పాకిస్తాన్ లోని తన ఇంటిని చసుకునేందుకు రీనా 1965లోనే దరఖాస్తు చేసుకున్నారట. ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అనుమతి దక్కకుండా చేశాయని వాపోయారు. 1947 తర్వాత దేశ విభజన సమయంలో తన కుటుంబం భారతదేశానికి వచ్చేసిందని.. అప్పట్లో ఆమెకు 15 సంవత్సరాల వయస్సుండేదని గుర్తు చేసుకున్నారు.

Read Also: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా..

అప్పటి జ్ఞాపకాలను తన పూర్వీకుల ఇంటి విశేషాలు, ఆ వీధులు ఇంకా మరిచిపోలేనని తెలిపారామె.