Name : వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. ఆ పిల్లాడి పేరు.. ABCDEF GHIJK Zuzu

పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. జన్మించిన టైమ్, నక్షత్రాలు, రోజులు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కొందరు పండితుల సలహా తీసుకుంటారు.

Name : వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం.. ఆ పిల్లాడి పేరు.. ABCDEF GHIJK Zuzu

Name

Updated On : October 28, 2021 / 7:20 PM IST

Name : పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. జన్మించిన టైమ్, నక్షత్రాలు, రోజులు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కొందరు పండితుల సలహా తీసుకుంటారు. మరికొందరు న్యూమరాలిజస్టులను ఆశ్రయిస్తారు. ఇంకొందరు బంధువులు, ఫ్రెండ్స్ ని అడుగుతారు. మరికొందరు గూగుల్ లో సెర్చ్ చేస్తారు. అల్టిమేట్ గా తమ పిల్లల పేరు చాలా డిఫరెంట్ గా, ఫ్రెష్ గా ఉండాలని చూస్తారు. ఈ క్రమంలో కొందరు తమ పిల్లలకు పెడుతున్న పేర్లు నోరు కూడా సరిగా తిరగనివి ఉంటున్నాయి. ఏది ఏమైనా.. అర్థవంతమైన పేరు ఉండేలా చూసుకుంటారు.

Amma Odi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

అయితే, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి.. పేరు కోసం తంటాలు పడటం తన వల్ల కాదని అనుకున్నాడో మరో కారణమో కానీ, తన కొడుక్కి వింతైన పేరు పెట్టాడు. ఇంతకీ ఆ పిల్లాడి పేరు ఏంటో తెలుసా? ABCDEF GHIJK Zuzu. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఆ పిల్లాడి పేరు ఇదే. మొదట్లో స్కూల్ నిర్వాహకులు కూడా ఇది జోకేమో అనుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ చూపించాక నమ్మక తప్పలేదు.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని మురా ఎనిన్‌లో ఇటీవల స్కూల్ పిల్లలకు కరోనావైరస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు ఓ బాలుడి పేరు చూసి ఆశ్చర్యపోయారు. 12 ఏళ్ల ఆ బాలుడి పేరు ABCDEF GHIJK Zuzu అని తెలుసుకుని విస్తుపోయారు. ఆ పిల్లాడు జోక్ చేస్తున్నాడేమో అని అధికారులు తొలత భావించారట. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

జూజు స్కూల్ ఐడెంటీ కార్డుపైన, అతడి స్కూల్ యూనిఫామ్ ట్యాగ్ కూడా ABCDEF GHIJK Zuzu అనే ఉంది. క్రాస్‌వర్డ్ పజిల్స్‌పై, అక్షరాలపై ఉన్న అభిమానం వల్లే ఆ తండ్రి తన కొడుక్కి ఆ పేరు పెట్టాడట. అయితే, జూజు అనేది మాత్రం అతడి తల్లిదండ్రుల పేర్ల నుంచే వచ్చింది. తండ్రి జుహ్రో, తల్లి జుల్ఫామీ పేర్లలోని ముందు అక్షరాలను అతడి పేరులో చేర్చారు. దీంతో అంతా జూజు అని పిలుస్తున్నారు. ఆ వ్యక్తి తన కొడుక్కి కేవలం ABCDEF GHIJK అనే మాత్రమే పేరు పెట్టి ఉంటే.. అతడి పేరు పిలిచేందుకు అంతా నానా తంటాలు పడాల్సి వచ్చేదని స్థానికులు నవ్వుకుంటున్నారు.