Amma Vodi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.

Amma Vodi : అమ్మఒడి డబ్బులు.. ప్రభుత్వం కొత్త రూల్

Amma Odi

Amma Vodi : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ. 15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే రెండేళ్ల పాటు లక్షలాది మందికి ఈ పథకాన్ని అందించిన విషయం తెలిసిందే.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

తాజాగా అమ్మఒడి పథకం కింద డబ్బులు రావాలంటే ప్రభుత్వం కొత్త షరతు పెట్టింది. అమ్మఒడి పథకానికి 75శాతం హాజరు తప్పనిసరి చేసింది. నవంబర్ 8, 2021 నుంచి ఏప్రిల్ 30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరం ఉంటుంది. ఇందులో 75శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకానికి అర్హులు అవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా కరోనా ఉంది కాబట్టే ఈ నిబంధన అమలు చేయలేదని, ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

2022 జనవరిలో అమలు చేయాల్సిన అమ్మఒడి పథకం జూన్ నెలలో అమలు చెయ్యాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే పథకం వర్తిస్తుందని… ప్రచారం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి అమ్మ ఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమలు చేయనున్నారు. నాణ్యమైన ప్రమాణాలతో విద్య భోదిస్తున్న ఏపీ సర్కార్.. అందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇంత చేస్తున్నా.. విద్యార్థులను స్కూల్‌కి తీసుకురాకపోతే అనుకున్న మేర ఫలితాలు రావు. అందుకే ఏపీ సర్కార్ హాజరుతో అమ్మ ఒడిని ముడి పెట్టాలని నిర్ణయించింది.

Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4,035 ఉద్యోగాలు భర్తీ

సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కొత్తగా 1285 ఉద్యోగాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో 560 ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో 2190 మందిని నియమించుకునేందుకు వీలుగా మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తంగా 4035 కొత్త ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.