Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4,035 ఉద్యోగాలు భర్తీ

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 4వేల 035 ఉద్యోగాల భర్తీకి..

Jobs : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 4,035 ఉద్యోగాలు భర్తీ

Jobs

Jobs : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 4వేల 035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

మెడికల్ కాలేజీల్లో 2వేల 190 ఉద్యోగాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్ లో 560 ఫార్మాసిస్టులు సహా మొత్తం 4,035 పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. వైద్యశాఖలో 41వేల 308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే ఇప్పటికే 26వేల 197 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి పేర్నినాని తెలిపారు.

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Diwali with Mi sale: స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు

కేబినెట్ ఆమోదించిన అంశాలు..
* స్వరూపానందేంద్ర సరస్వతికి చెందిన విశాఖ శారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపు
* జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్ కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు
* రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ ల ఏర్పాటుకు భూముల కేటాయింపు
* పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
* జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు
* వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

* వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలకు ఆమోదం.
* కొత్తగా 1,285 ఉద్యాగాల భర్తీకి మంత్రివర్గం అంగీకారం.
* అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి ఆమోదం.
* ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 26,917 ఉద్యోగాలిచ్చామన్న ప్రభుత్వం

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

* అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు ఆమోదం
* రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ను అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం
* సినిమాటోగ్రఫీ చట్ట సవరణకు ఆమోదం
* ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు (యూనిట్ రూ. 2.49 చొప్పున) ప్రతిపాదనకు ఆమోదం
* బీసీ జనాభాను కులాలవారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం
* విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు ఆమోదం