అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

అభినందన్‌ పాక్ బోర్డర్‌లో దిగగానే ఏం జరిగింది?

Updated On : February 28, 2019 / 9:25 AM IST

పాకిస్తాన్ అదుపులో ఉన్న అభినందన్.. పాక్ చేతికి చిక్కగానే చిత్రహింసలకు గురైనట్లు వీడియోలు చక్కర్లుకొడుతున్నాయి. అయితే పట్టుబడ్డ రోజైన బుధవారం సాయంత్రం మరోసారి మీడియా ముందుకొచ్చిన అభినందన్.. తాను క్షేమంగా ఉన్నట్లు పాక్ ఆర్మీ తన పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పాడు. అసలు దాని కంటే ముందు ఏం జరిగి ఉంటుందనేది అందరికీ వచ్చే ప్రశ్నే.. దీని గురించి పాక్ ప్రముఖ మీడియా డాన్(DAWN) ప్రత్యేక కథనం ప్రచురించింది.
Read Also :చర్చలకు సిద్ధం: అభినందన్ ను రిలీజ్ చేస్తాం!

లైన్ ఆఫ్ కంట్రోల్‌కు సరిగ్గా 7కి.మీ దూరంలో అంటే పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని హొర్రా గ్రామంలో నివాసముంటున్న మొహమ్మద్ రజఖ్ చౌదరి ఆకాశంలో పెద్ద ఎత్తున శబ్దం, దట్టమైన పొగ కనిపించాయి. నిశితంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది రెండు యుద్ధ విమానాలు కూలిపోతున్నాయని.. అందులో ఒకటి వెంటనే అక్కడే పడిపోయింది. రెండోది ఆకాశంలోకి కాస్త దూరం వరకూ ఎగిరి కూలిపోతూ కనిపించింది. 
Read Also : అభినందన్ ప్రొఫైల్ : హైదరాబాద్ లోనే ట్రైనింగ్

అందులో నుంచి ఓ వ్యక్తి పారాషూట్‌లో రావడం గమనించాడు. రజఖ్ ఇంటికి ఒక కి.మీ దూరంలో ల్యాండ్ అయినట్లు అనుమానం రావడంతో దగ్గర్లోని యువకులను తీసుకుని అక్కడికి వెళ్లాడట. ఇండియన్ పైలట్ ఇది ఇండియానా.. పాకిస్తానా.. అని అడగ్గా.. ‘అందులో ఒకరు ఇది ఇండియానే’ అని చెప్పాడట. 

ఆ తర్వాత కాసేపపటికి ఆ కుర్రాళ్లంతా పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో.. పైలట్ ఆత్మరక్షణ కోసం చేతిలో గన్ బయటికి తీసి కాల్పులు జరుపుతూ కొద్ది దూరం పరిగెత్తాడట. కానీ, క్షణాల్లో జనాలు పెరిగిపోవడం, రాళ్లతో దాడి చేస్తుండటంతో తుపాకీ పక్కకు పడేయాల్సి వచ్చింది. అతనితో పాటు తీసుకెళ్లిన మ్యాప్ కూడా మింగేయబోతుంటే పైలట్ మీదకు దాడి చేసి తీవ్రంగా కొట్టారట.

పాక్ ఆర్మీకి విషయం తెలిసి అక్కడికి వచ్చేంతవరకూ అభినందన్‌పై దాడి కొనసాగిందట. ఆ తర్వాత ఆర్మీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. పేరు, క్యాడర్, రహస్యాలు వంటి విషయాలపై జరిపిన విచారణలో వృత్తిపరంగా అనుమతి ఉన్నవాటికి మాత్రమే సమాధానాలిచ్చాడు భారత పైలట్. అదే రోజు సాయంత్రం పాక్ ఆర్మీ ఆ వీడియోను విడుదల చేస్తూ పైలట్ క్షేమ సమాచారాన్ని తెలియజేసింది. 
Read Also : సర్జికల్ దాడుల బాబు : సైనిక కుటుంబంలో‘మిరాజ్ సింగ్’ పుట్టాడు