అక్కడంతే : కూతురు పోలీస్ ఉద్యోగం చేస్తోందని కంటి చూపు పోగొట్టిన తండ్రి

  • Published By: nagamani ,Published On : November 10, 2020 / 03:40 PM IST
అక్కడంతే : కూతురు పోలీస్ ఉద్యోగం చేస్తోందని కంటి చూపు పోగొట్టిన తండ్రి

Updated On : November 10, 2020 / 4:20 PM IST

Afghanistan women working cop blinded getting job : అఫ్ఘానిస్థన్ లో మహిళలపై ఎంతటి ఘోరమైన ఆంక్షలుంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. వారి పేరు కూడా బైటవారికి చెప్పకూడదు..వారి పేరు ఎక్కడా కనిపించకూడదు. వారి పేరు పెట్టి ఎవ్వరూ పిలవకూడదు. ఇలా మహిళల ఉనికి అంతా ఆంక్షల మయం..ఆంక్షలు అణచివేతలతో వారిలో ఉండే ప్రతిభా పాటవాలు అణచివేయబడుతున్నాయి. అలా పోలీస్ ఆఫీసర్ అయి నేరస్తులకు చుక్కలు చూపించాలనే ఓ మహిళ కలను అత్యంత కర్కశంగా కాలరాసేశాడు కన్నతండ్రి.



ఎంతో ఆశతో పోలీస్ అవ్వాలనే కలను నెరవేర్చుకుంది ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఖతేరా అనే మహిళ. కానీ కూతురు బైటకెళ్లి ఉద్యోగం చేయటం ఇష్టంలేదని ఆమె తండ్రి అత్యంత దారుణంగా కిరాయి మనుషులను పెట్టి ఆమె కంటిచూపు పోయేలా దాడి చేయించాడు.కన్నతండ్రి అంతటి దారుణానికి తెగబడతాడని ఊహించిన ఆ కూతురు ఇప్పుడు తన కలల్నీ కరిగిపోగా కంటిచూపు పోగొట్టుకుని అంథురాలిగా మిగిలిపోయింది.


వివరాల్లోకి వెళితే..ఖతేరాకు చిన్ననాటి నుంచి బాగా చదువుకుని..పెద్ద పోలీస్ ఆఫీసర్‌ అవ్వాలని కోరిక. తన కలను నెరవేర్చుకోవటానికి తండ్రితో పోరాటమే చేసింది. చదువుకుంటానని తండ్రిని అడిగింది. కానీ ఆడపిల్లలు బైటకెళ్లి చదువుకోవటం ఇష్టలేని అతను చదువలేదు ఏమీలేదు ఇంట్లో పడుండు అని హుంకరించాడు. ఆడపిల్లలకు చదువెందుకు? ఇంటిలో పడుండాలని అనేవాడు. కానీ ఖతేరా పదే పదే అడగటంతో బలవంతంగా ఖతేరాను చదివించాడు. కానీ ఉద్యోగం చేస్తానంటే కాళ్లు నరికేస్తానని ముందే హెచ్చరించాడు. ఆమాత్రం దానికి ఖతేరా సంబరపడిపోయింది. ప్రస్తుతానికి చదువు పూర్తిచేద్దాం..ఆ తరువాత తన కల నెరవేర్చుకుందాం కాలం మారకపోతుందా? తండ్రి ఒప్పుకోకపోతాడని ఆశపడింది.


చదువయ్యాక ఉద్యోగం చేస్తానని కూతురు అడగటంతో తండ్రి మండిపోయాడు.ఇలాగుంటే కుదరదని పెళ్లి చేసేశాడు. కానీ ఖతేరా అదృష్టం కొద్ది అర్థం చేసుకునే భర్త దొరికాడు. తన కోరికను భర్తతో చెప్పింది. దానికి అతను భార్య మనస్సు అర్థంచేసుకుని నీ ఇష్టం అన్నాడు. ప్రొత్సాహించాడు. భర్త ప్రోత్సాహంతో ఖతేరా తన కలను నేరవేర్చుకుంది. కొద్ది నెలల క్రితం అప్ఘనిస్తాన్‌లోని ఘజ్ని ప్రావిన్స్‌లోని పోలీసు స్టేషన్‌లో క్రైమ్‌ బ్రాంచ్‌లో అధికారిగా ఉద్యోగం రావటంతో ఆనందంగా ఉద్యోగంలో చేరిపోయింది. ఎంతో ఉత్సాహంగా..డ్యూటీ చేసేది.



https://10tv.in/six-constables-suspended-for-obscene-comments-on-woman-cop-up-pilibhit/
కూతురు ఉద్యోగం చేస్తోందని తెలిసిన తండ్రి అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డాడు. ఉద్యోగం మానేసి ఉంట్లోనే పండుండి అని చెప్పాడు. కానీ భర్త ప్రోత్సాహం ఉండటంతో ఖతేరా తండ్రి మాటల్నీ ఖాతరు చేయలేదు. దీంతో బెదిరింపులకు దిగాడు తండ్రి. తాను చెప్పిన మాట వినకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కానీ ఖతేరా వినలేదు. ఉద్యోగం చేయటం మానలేదు. ఉద్యోగంలో చేరి మూడు నెలలైంది.


ఈ క్రమంలో ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఖతేరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు 33ఏళ్ల ఆమె మీద కత్తితో దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఊహించని ఈ పరిణామానికి ఖతేరా షాక్ లోంచి తేరుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖతేరాని ఆస్పత్రిలో చేర్చారు. ప్రాణాపాయం తప్పింది కానీ దుండగులు జరిపిన దాడిలో ఆమె చూపు కోల్పోయింది. దీంతో ఆమె కోలుకున్నా..ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.


కానీ ఈ దాడి తాలిబన్లే చేయించారని అనుకుంది. కానీ నీపై దాడి చేయమని నీ తండ్రే మాకు చెప్పాడని తాలిబన్లు తేల్చి చెప్పారు. తన తండ్రి ఇంత ఘాతుకానికి ఒడిగడతాడని ఊహించలేదని నా కలల్ని నా తండ్రే కాలరాసేశాడని తల్లిడిల్లిపోతోంది. తన తండ్రే తనపై ఈ దాడిచేయించాడని తేలటంతో ఖతేరా మాట్లాడుతూ..తాను ఉద్యోగం చేయడం తండ్రికి ఇష్టం లేదనీ మొదటినుంచీ ఆయన వ్యతిరేకిస్తునే ఉన్నాడనీ తనను చాలాసార్లు బెదిరించాడని తెలిపింది. తనకు పెళ్లిచేసి పంపేసిన తరువాత కూడా తనపై ఇంత పెద్తనం చేయటం ఏంటనీ..తన కలల్ని కాలరాసే హక్కుల అతనికి ఎక్కడిదని ప్రశ్నిస్తోంది.



తన భర్త చాలా మంచివారు..ఆయన ప్రొత్సాహంతో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాను. నా కలల్ని నెరవేర్చుకున్నాను. కానీ నా తండ్రే నాపాలిట దుర్మార్గంగా వ్యవహరించి నా జీవితాన్నే అంథకారం చేసేశాడని వాపోయింది. తాను ఉద్యోగం మానేసేలా బెదిరించమని నా తండ్రి తాలిబన్లను అడిగాడనీ..నా ఐడీ కార్డు వారికి ఇచ్చి నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నానని వారికి చెప్పి నన్ను ఉద్యోగం మానేసేలా బెదిరించమనీ కోరాడని..దాడి జరిగిన రోజు కూడా మా నాన్న నాకు ఫోన్‌ చేసి నేను ఎక్కడ ఉన్నది కనుకున్నాడు’ అని చెప్పింది ఖతేరా.



ఇలా జరుగుతుందని తెలుసు..అన్నింటిక తెగించే ఉద్యోగంలో చేరా
‘ఏదో ఓ రోజు నాపై దాడి జరుగుతుందని తెలుసు. కానీ కనీసం ఒక్క సంవత్సరమైనా పోలీసుగా ఉద్యోగం చేయాలని ఆశపడ్డాను. కానీ ఇంతలోనే నాతండ్రి చేసిన ఘాతుకానికి బలైపోయానని వాపోయింది. నా పరిస్థితిని పరీక్షించిన డాక్టరు నాకు కొంతలో కొంత చూపు వస్తుందని తెలిపారు. అదే నిజమైతే.. చూపు వస్తే.. వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరతాను’ అని ధైర్యంగా ఏమాత్రం సడలని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఖతేరా.


ఈ దాడి తరువాత ఖతేరా తన ఐదుగురు పిల్లలతో కలిసి కాబూల్‌లో రహస్యంగా జీవనం సాగిస్తోంది. ఇక తనకు తండ్రే లేడనీ.. పుట్టింటితో అన్ని రకాల సంబంధాలు తెంచేసుకున్నాననీ..తెలిపింది. కానీ ఓ పోలీసు ఆఫీసర్ గా పనిచేసిన నేను ఇంత ఘోరమైన నేరం చేసిన తండ్రిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్‌ చేశారు. కన్నతండ్రిపైనే కేసు పెడతావా? అని తల్లి కూతురిపై ఆగ్రహం వ్యక్తంచేయటంతో కూతురు కంటిచూపు పోగొట్టిన భర్త నీకు ఎక్కువైతే..ఓ పోలీసు ఆఫీసురుగా నాకు నేరస్థుడిని శిక్షించటమే ఎక్కువ అని తల్లితో కూడా తెగతెంపులు చేసేసుకుంది ఖతేరా.


కాగా.. అఫ్ఘనిస్తాన్‌లో మహిళలు ఉద్యోగాలు చేయడం.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం తాలిబన్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇష్టంపడరు. మహిళలు ‘పబ్లిక్‌ రోల్స్‌‌లో ఉండటం అస్సలు ఇష్టపడరు. ఎదిరిస్తే ఇటువంటి దారుణాలకు బలి అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా హింస పెరగడంతో వారి పరిస్థితి మరింత దిగజారిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ క్యాంపెయినర్‌ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలపై పెరుగుతున్న ఆంక్షలపై మానవ హక్కుల సంఘాల వారు నిరంతరం పోరాడుతునే ఉంటారు.