Corona With Mouse : షాకింగ్.. ఎలుక‌ల ద్వారా క‌రోనా..? అసలేం జరిగిందంటే..

కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి.

Corona With Mouse : షాకింగ్.. ఎలుక‌ల ద్వారా క‌రోనా..? అసలేం జరిగిందంటే..

Corona With Mouse

Updated On : December 10, 2021 / 9:30 PM IST

Corona With Mouse : కరోనావైరస్ మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. కాస్త తగ్గింది.. అని ఊపిరిపీల్చుకునేలోపు కొత్త వేరియంట్ రూపంలో మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.

Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ.19వేలు పొగొట్టుకొన్న యువతి

తాజాగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఎలుక ద్వారా కరోనా సోకిందనే వార్త కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. యూర‌ప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఉధృతి క్ర‌మంగా పెరుగుతోంది. రీసెంట్ గా తైవాన్‌లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రెండోసారి క‌రోనా కేసులు ఎలా మొద‌ల‌య్యాయి అనే అంశంపై ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఓ షాకింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రెండోసారి ఓ మ‌హిళా సైంటిస్ట్ కు కరోనా సోకింద‌ని, ఆమె ద్వారా తైవాన్‌లో మెల్లిగా కేసులు పెరుగుతున్నాయ‌ని వెల్ల‌డైంది.

తైవాన్‌లో హై సెక్యూరిటీ ల్యాబ్‌లో ఆ మ‌హిళ ప‌నిచేస్తుంది. ల్యాబ్‌లో ఓ ఎలుక ఆమెను రెండుసార్లు క‌రిచిందట. ఎలుక క‌రిచిన త‌రువాత‌నే ఆ మ‌హిళ‌కు క‌రోనా సోకిన‌ట్టు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై ఇన్వెస్టిగేషన్ జ‌రుగుతోంది. ఎలుక‌ల ద్వారా క‌రోనా సోక‌డం నిజ‌మే అయితే మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి ఉంటుందని తైవాన్ ప‌రిశోధ‌కులు అంటున్నారు. బాధితురాలు తైవాన్ టాప్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అకాడెమియా సినికాలో పని చేస్తుంది. గత నెలలో కరోనా బారిన పడింది.

Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

కరోనా సోకిన ఎలుక రెండుసార్లు కరిచిందని, ఆ కారణంగానే ఆమె కరోనా బారిన పడి ఉండొచ్చని తైవాన్ ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. కరోనా బారిన పడ్డ ల్యాబ్ వర్కర్ కు ట్రావెల్ హిస్టరీ లేదు. ఆమె దేశం విడిచి వెళ్లింది లేదు. అంతేకాదు మోడెర్నా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. ఇకపోతే అకామెమియా సినికా ల్యాబ్ బయో సేఫ్టీ సెక్యూరిటీ లెవెల్ లో టాప్ 2 లో ఉంది. తైవాన్ లో నవంబర్ 5న చివరి కరోనా కేసులు కన్ ఫర్మ్ అయ్యింది. ల్యాబ్ వర్కర్ తో కాంటాక్ట్ అయిన 100మందిని ట్రేస్ చేశారు. వారందరిని క్వారంటైన్ లో ఉంచారు. తైవాన్ లో ఇప్పటివరకు 14వేల 500 కరోనా కేసులు, 848 కరోనా మరణాలు సంభవించాయి.