War with Aliens :మూడో ప్రపంచ యుద్ధం ఏలియన్స్ తోనేనా..?!అవే మన క్షిపణుల్ని పనిచేయకుండా చేస్తున్నాయా?
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే జరుగుతుందట. అందుకే ఏలియన్స్ మన అణు క్షిపణుల్ని ట్యాంపరింగ్ చేస్తున్నాయట..పనికిరాకుండా చేస్తున్నాయట.దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు..
Third World War with the Aliens : ఏలియన్స్. అంటే గ్రహాంతరవాసులు. అసలు ఉన్నాయా? లేక మన భ్రమా? ఏలియన్స్ కొంతమందిని ఎత్తుకుపోయారనే కథనాలు వింటున్నాం. కానీ అవి ఎంత వరకు నిజాలో తెలీదు. ఎగిరే పళ్లాలను చూశామని కూడా చాలామంది చెబుతుంటారు. ఆ ఎగిరే పళ్లాలలోనే ఏలియన్స్ భూమ్మీదకు వచ్చిపోతున్నారా? ఇది నిజమేనా? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఈక్రమంలో మరో ఆసక్తికర విషయం ఒకటి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మన భూమ్మీద మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం జరిగాయి. కానీ మూడో ప్రపంచ యుద్ధం మాత్రం ఏలియన్స్ తోనే జరుగుతుందట. ఈ విషయాన్ని యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు.
Read more : Alien abduction: ఏలియన్స్ నన్ను 50సార్లు కిడ్నాప్ చేశారు..
రాబర్ట్ సలాస్ అలా ఎందుకన్నారంటే..ఏలియన్స్ అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నాయనీ..ట్యాంపరింగ్ చేయటమేకాకుండా వాటిని పనిచేయకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఈ విషయాన్ని తాను గుర్తించానని నమ్మకంగా చెబుతున్నారు యూఎష్ మిలటరీ అధికారి రాబర్ట్ సలాస్. గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేస్తున్నాయని…అంతేకాకుండా వాటిని పనిచేయకుండా చేస్తున్నాయని అంటున్నారు.ఏలియన్స్ కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేస్తున్నాయని..అంతేకాకుండా..అవి పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పనికిరాకుండా చేస్తున్నాయని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు పత్రాలల్లో పొందుపరిచి విడుదల చేస్తారని సలాస్ అన్నారు.మార్చి 16, 1967 న, మరొక క్షిపణి ప్రయోగ నియంత్రణ సదుపాయంలో ఇలాంటి సంఘటన జరిగిందని అంటున్నారు.
Read more : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!
కాగా రాబర్ట్ సలాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నారు. 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించారు రాబర్ట్ సలాస్.మరి ఇంత అనుభవం కలిగి..ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత పక్కాగా ఏలియన్స్ తోనే మన మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పటంలో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగాను..ఆందోళనకరంగాను మారింది.అంతేకాదు రాబర్ట్ వెల్లడించిన ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి.
Read more : ఏలియన్లు భూమి మీదకు 2017లోనే వచ్చాయ్.. ఇదే సాక్ష్యం!!
మరి నిజంగానే ఏలియన్స్ తో మనుషుల యుద్ధం చేస్తే గెలిచేదెవరు?ఓడేది ఎవరు? అనే ప్రశ్నలకు అర్థమే లేదు.ఎందుకంటే ఏలియన్స్ చాలా శక్తివంతమైనవనీ..టెక్నాలజీలో మనల్ని 100 రెట్లు మించిపోయాయని ఇప్పటికే పలువురు సైంటిస్టులు పేర్కొన్నారు. మరి అంతటి టెక్నాలజీ కలిగిన ఏలియన్స్ ముందు మనిషి మేథా శక్తి..టెక్నాలజీ ఎంత వరకు నిలుస్తుంది?అనేది పెద్ద ప్రశ్న..ఇదో బ్రహ్మాండమైన ఛేధించలేని ప్రశ్న అనుకోవాల్సిందే.