American singer Mary Millben : అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్‌బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు....

American singer Mary Millben : అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం

అమెరికా గాయని మేరీ మిల్‌బెన్ మోదీకి పాదాభివందనం

Updated On : June 24, 2023 / 10:22 AM IST

American singer Mary Millben : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్‌బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్‌బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. (PM Modi US Visit 2023)

PM Modi Visit Egypt: ముగిసిన అమెరికా టూర్.. ఈజిప్ట్ పర్యటనకు ప్రధాని మోదీ.. చారిత్రాత్మక మసీదు సందర్శన

వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటరులో యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 38 ఏళ్ల మిల్‌బెన్ భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. (Mary Millben Touches PM Modi’s Feet) ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్‌బెన్ ఆమె జాతీయ గీతం జన గణ మన (Singing Jana Gana Mana), ఓం జై జగదీశే హరే పాటలు పాడి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందారు.

Mega India-US Deals: మోదీ పర్యటనతో మెగా ఇండియా-యూఎస్ కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ కోసం భారత జాతీయ గీతాన్ని పాడటం తనకు చాలా గౌరవంగా ఉందని మేరీ వ్యాఖ్యానించారు. అమెరికన్, భారతీయ గీతాలు రెండూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఆదర్శాలను తెలియజేస్తాయని, ఇవి యూఎస్-ఇండియా సంబంధాల నిజమైన సారాంశమని ఆమె చెప్పారు.

Sundar Pichai Meets PM Modi : గుజరాత్‌లో గూగుల్ ఫిన్‌టెక్ సెంటర్

భారతీయ విలువలు, ఆధ్యాత్మిక ప్రకాశంతో మోదీ ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారని మేరీ పేర్కొన్నారు. గత నెలలో ప్రధాని మోదీ పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా కూడా పసిఫిక్ ద్వీప దేశపు ప్రధాని గౌరవ సూచకంగా ప్రధాని మోదీ పాదాలను తాకారు.