America : ఉమ్మి, చుండ్రు,చెవిలో గులిమి అమ్మి లక్షలు సంపాదిస్తున్న యువతి
అమ్మకం అంటే ఏదైనా అమ్మేయొచ్చు డిమాండ్ ఉంటే అని నిరూపిస్తున్నారు ఎంతోంది. స్నానం చేసిన నీటిని అమ్మేసే ముద్దుగుమ్మ ఒకరైతే..కాళ్లు చూపెట్టి డబ్బులు సంపాదించే ‘సోల్ సోగ్గాడు’ఇంకొకరు. ఉమ్మి, కట్ చేసిన గోర్లు,తల్లో డేండ్రఫ్, శరీరంపై వెంట్రులే కాదు చెవిలో గులిమి కూడా అమ్మేస్తు లక్షలు సంపాదించే బిలియనీర్ అయిపోయిన ఇంకో ముద్దుగుమ్మ. ఇలా వింత వింత అమ్మకాలతో పిచ్చెక్కించేస్తున్నారు.

american woman ear wax dandruff, spit selling
America : కాదేదీ కవితకు అనర్హం అన్నాడో కవి..కానీ కాదేదీ అమ్మకానికి అనర్హం అంటోదీ ముద్దుగుమ్మ. మోడల్ గా, డ్యాన్స్ గా పేరు తెచ్చుకున్న ఓ ముద్దుగుమ్మ తన గోళ్లు,తల్లో చుండ్రు, నోట్లో ఉమ్మి, బాడీ మీద వెంట్రుకలు కూడా అమ్మేస్తోంది. ఛీ వీటిని ఎవరు కొంటారు?అని అనుకుంటున్నారా? అంతేమరి ఎవరి పిచ్చి వారికి ఆనందం. సెలబ్రెటీలు వాడిన వస్తువులకు మంచి డిమాండ్ ఉన్నట్లో సోషల్ మీడియాల్లో కూడా సెలబ్రిటీలుగా మారిన ఎంతోమంది ఎవ్వరు ఊహించనివి అమ్మేస్తు డబ్బులు సంపాదించేస్తున్నారు.
నిజానికి ఇలాంటి వస్తువులను అమ్మిన సెలబ్రిటీలు ఇంతకు ముందు చాలానే ఉన్నారు. అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జాసన్ స్టార్మ్ అనే వ్యక్తి. కేవలం తన కాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి వాటిని ఆన్‌లైన్‌లో అమ్మడాన్నే వృత్తిగా చేసుకుని డబ్బులు సంపాదించేస్తున్నాడు. అలాగే ఓ ముద్దుగుమ్మ తను స్నానంచేసిన నీటిని ఆన్ లైన్ లో అమ్మి డబ్బులు సంపాదింస్తోంది. మాజీ రియాల్టీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో అపాన వాయువును బాటిళ్లలో నింపి అమ్మిన వార్త ముక్కు మూసుకునేలా చేసినా సంచలనంగా మారింది. ఇలా కాదేదీ అమ్మకానికి అనర్హం అన్నట్లుగా అమెరికా నార్త్ కరోలినాలో చెందిన ‘రెబెక్కా బ్లూ’ మాత్రం నా స్టైలే వేరు అన్నట్లుగా తన ఉమ్మి, కట్ చేసిన గోర్లు,తల్లో డేండ్రఫ్, శరీరంపై వెంట్రులే కాదు చెవిలో గులిమి కూడా అమ్మేస్తోంది. వాటిని అమ్మి లక్షలు సంపాదిస్తోంది. ఏంటీ ఛీ యాక్ అనుకుంటున్నారా?
అమెరికా నార్త్ కరోలినాలో చెందిన ‘రెబెక్కా బ్లూ’ గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్‌గా చేసి ప్రస్తుతం వెబ్‌క్యామ్ మోడల్, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్‌ఫిట్స్‌ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు అమ్మింది. మీరు కూడా ఇలాంటివి అమ్మి డబ్బులు సంపాదించుకోండి అంటూ టిక్ టాక్ ద్వారా సూచిస్తోంది.
Lionel Messi: ముక్కు,మూతి తుడుచుకున్న టిష్యూ పేపర్ ధర రూ. 7.5 కోట్లు
ఇలా తను అమ్మే వీటికి మాంచి డిమాండ్ రావటంతో రెబెక్కా బ్లూ ఈ వినూత్న వ్యాపారంతో 28 ఏళ్లకే బిలినియర్ అయిపోయింది. రెబెక్కా మొదట్లో తను వాడేసి సాక్స్ వంటివి అమ్మటం ప్రారంభించింది. వాటికి మంచి డిమాండ్ రావటంతో ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, ఇంట్లో చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి డబ్బు సంపాదించటం మొదలుపెట్టి 30 ఏళ్లు రాకుండానే బిలియనీర్ అయిపోయింది.
రెండు కాళ్లతో లక్షలు సంపాదిస్తున్న ‘సోల్ సోగ్గాడు’
ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ అమ్మేస్తోంది. అలా నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.60 లక్షలకుపైనే. రెబెక్కాకు టిక్ టాక్ లో 351100మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక సెట్ గోళ్లను 300ల డాలర్లు అమ్మింది అంటే ఆమె అమ్మేవాటికి డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి మనకు ఛీ యాక్ అనిపిస్తాయి గానీ అమెరికా వంటి దేశాల్లో వినిపించటమే కాదు కనిపిస్తుంటాయి కూడా..అదే మరి అమెరికానా? మజాకానా? ఏవైనా అమ్మేస్తారు..ఎలాంటివైనా కొనేస్తారు అనిపిస్తోంది కదూ ఇలాంటివి వింటే..