Inflation : ఆకాశన్నంటిన గోధుమ పిండి ధర…కిలో రేటు రూ.320

ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది....

Inflation : ఆకాశన్నంటిన గోధుమ పిండి ధర…కిలో రేటు రూ.320

Most Expensive Flour

Updated On : July 17, 2023 / 5:21 AM IST

Inflation : ద్రవ్యోల్బణంతో ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశన్నంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో గోధుమ పిండి ధర అనూహ్యంగా పెరిగింది. కిలో గోధుమ పిండి ధర 320 రూపాయలకు చేరింది.ప్రపంచంలోనే పాకిస్థాన్ దేశంలో గోధుమపిండి ధరలు అత్యంత ఖరీదైనవిగా మారాయని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది. (Karachi Buying Most Expensive Flour)

Pakistan spy agent : యూపీలో పాకిస్థానీ గూఢచారి అరెస్ట్

కరాచీతో (Karachi) పాటు పాక్ హైదరాబాద్, ఇస్లామాబాద్, రావల్పిండడి, సియాల్ కోట్, ఖుజ్దార్ లో గోధుమపిండి ధరలు గణనీయంగా పెరిగాయి. (Amid Inflation) పాకిస్థాన్ దేశంలోని ప్రధాన నగరాలతోపాటు బహవల్పూర్, ముల్తాన్, సుక్కూర్, క్వెట్టా పట్టణాల్లో గోధుమపిండి ధరలు అనూహ్యంగా పెరిగాయి.గోధుమపిండితో పాటు కిలో చక్కెర ధర 160 రూపాయలకు పెరిగింది.

Delhi Floods: అస్సాం వరదలకు చైనా, భూటాన్ దేశాలే కారణం.. కేజ్రీవాల్ మీద సెటైర్లు వేసిన అస్సాం సీఎం

ఇప్పటికే పాకిస్థాన్ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కేంద్రాల్లో గోధుమపిండి పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటల్లో పలువురు మరణించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాక్ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రపంచంలోని మొదటి ఐదు అత్యల్ప నివాసయోగ్యమైన పట్టణాల్లో పాకిస్థాన్‌లోని కరాచీ కూడా స్థానం పొందిందని కనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. ప్రపంచంలోని లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాల కంటే కరాచీ 169 వ స్థానంలో నిలిచింది.