South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా భారీ సైనిక కవాతు

ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా మంగళవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును మంగళవారం నిర్వహించింది....

South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా భారీ సైనిక కవాతు

South Korea Military Parade

South Korea : ఉత్తర కొరియా బెదిరింపుల నేపథ్యంలో దక్షిణ కొరియా మంగళవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంబిస్తూ దక్షిణ కొరియా దశాబ్దంలో తన మొదటి భారీ సైనిక కవాతును మంగళవారం నిర్వహించింది. (South Korea To Stage Rare Military Parade) సియోల్‌లో జరిగిన ఈ కవాతులో వేలాది మంది సైనికులు, దక్షిణ కొరియా స్వదేశీ యుద్ధ ట్యాంకులు, స్వీయ-చోదక ఫిరంగితో పాటు యుద్ధ విమానాలు, డ్రోన్‌లు ఉన్నాయి. (Amid North Koreas Threats) దక్షిణ కొరియా సాయుధ దళాల దినోత్సవం సందర్భంగా ఈ కవాతు జరిపింది.

Congress MLA : బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దక్షిణ కొరియా చివరిసారిగా 2013లో సైనిక కవాతును నిర్వహించింది. నార్త్ కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై ప్రతిగా దక్షిణ కొరియా ఈ కవాతు జరిపింది. దక్షిణ కొరియా దేశంలో యూఎస్ సైనికులు కూడా ఈ కవాతులో చేరారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సియోల్ ప్రధాన వాణిజ్య, వ్యాపార జిల్లా గుండా సియోల్ నడిబొడ్డున ఉన్న విశాలమైన ప్యాలెస్‌కి ద్వారం ఉన్న గ్వాంగ్‌వామున్ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ సైనిక కవాతు నిర్వహించారు.

BMW : భారత మార్కెట్లోకి కొత్తగా బీఎండబ్ల్యూ ఐ ఎక్స్1 పూర్తి ఎలక్ట్రిక్ కారు

యున్ ప్యోంగ్యాంగ్ దురాక్రమణకు పాల్పడితే దానికి వ్యతిరేకంగా వాషింగ్టన్, టోక్యోలతో సైనిక కూటమిని చురుకుగా బలోపేతం చేశామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ చెప్పారు. మంగళవారం నాటి కవాతు సియోల్ శివార్లలోని సియోంగ్నామ్‌లోని వైమానిక స్థావరం వద్ద ప్రారంభం అయింది. దక్షిణ కొరియా ఈ సైనిక కవాతులో హ్యూన్‌మూ క్షిపణులు, ఎల్-శామ్ క్షిపణి ఇంటర్‌సెప్టర్లు, ఎఫ్-35 జెట్‌లు,మొట్టమొదటిగా దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం కేఎఫ్-21లను బహిరంగ ప్రదర్శనలో ఉంచింది.

Next Pandemic Disease X : కొవిడ్ కంటే ఎక్స్ మహమ్మారి ప్రాణాంతకం…50 మిలియన్ల మందిని చంపగలదని అంచనా

దక్షిణ కొరియా యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సంయుక్తంగా అప్ గ్రేడెడ్ కంబైన్డ్ ఢిఫెన్స్ విన్యాసాలను ప్రదర్శించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా దేశ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వారం తర్వాత ఈ కవాతు జరిపారు. ఈ సమయంలో కిమ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సైనిక సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించారు.