Apple Watch: గుండెపోటు నుంచి రచయితను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగంటే..

Apple Watch: యాపిల్ వాచ్ (AppleWatch) హార్ట్ రేట్ పై యూజర్లను ఎప్పటికప్పుడు హెచ్చరించి ప్రాణాలను కాపాడుతోంది. తాజాగా యాపిల్ వాచ్ వల్ల యూకే (UK) కు చెందిన టాప్ సెల్లింగ్ రచయిత ప్రాణాలతో బయటపడ్డాడు.

Apple Watch: గుండెపోటు నుంచి రచయితను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగంటే..

Updated On : March 13, 2023 / 5:06 PM IST

Apple Watch: యాపిల్ వాచ్ (AppleWatch) హార్ట్ రేట్ పై యూజర్లను ఎప్పటికప్పుడు హెచ్చరించి ప్రాణాలను కాపాడుతోంది. ఇలాంటి సందర్భాలు చాలా వెలుగు చూశాయి. తాజాగా యాపిల్ వాచ్ వల్ల యూకే (UK) కు చెందిన టాప్ సెల్లింగ్ రచయిత ప్రాణాలతో బయటపడ్డాడు. సకాలంలో ఆస్పత్రిలో చేరిన అతను ఈసీజీలు తీసుకున్న తర్వాత అతని పరిస్థితిని వివరించాడు.

36 ఏళ్ల ఆడమ్ క్రాఫ్ట్, యూకేలో పాపులర్ రచయిత. అతని పుస్తకాలు రెండు మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. అతడు ఇటీవల ఒక రోజు సోఫా నుంచి లేస్తుండగా… అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే నీళ్లు తాగేందుకు కిచెన్ లోకి వెళ్ళాడు. కానీ అతనికి అప్పటికే నీరసమైన ఫీలింగ్ కలిగింది. అతనికి ఏం జరుగుతోంది తెలియలేదు. కానీ ఆడమ్ క్రాఫ్ట్ ధరించిన ఆపిల్ వాచ్ అలెర్ట్ సిగ్నల్ ఇవ్వడాన్ని గమనించాడు.

ప్రతి రెండు గంటలకు అతని హార్ట్ బీట్ (heart beats) సరిగ్గా కొట్టుకోవడం లేదని హెచ్చరించింది. అది చూస్తూనే క్రాఫ్ట్ సోఫాపై కూలాడు. అతను మరుసటి రోజు ఉదయం లేచాడు. అతని ఆపిల్ వాచ్ ప్రతి రెండు గంటలకు తన గుండెలో మార్పులు వస్తున్నాయని చెప్పింది. రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్ వచ్చి మరణానికి దారితీయవచ్చని మళ్లీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో అతను 111కి కాల్ చేశాడు. గంటలో బెడ్‌ఫోర్డ్ హాస్పిటల్‌ కు వెళ్లామని క్రాఫ్ట్ చెప్పాడు.

రెండు ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ (ECG)లు తీసిన తర్వాత యాపిల్ వాచ్ చెప్పిన విషయం నిజమే అని డాక్టర్లు నిర్ధారించారు. క్రాఫ్ట్ అనుభవించిన ఈ నొప్పిని గుర్తించి ఆపిల్ వాచ్ తనను హెచ్చరించకపోతే, అతను 111 నంబర్‌కు కాల్ చేసి ఉండేవాడిని కాదని చెప్పాడు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

Also Read: భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట.. అధ్యయనంలో వెల్లడి