Astronauts Cancer Risk : వ్యోమగాములకు క్యాన్సర్ ముప్పు..పరిశోధనల్లో వెల్లడి
వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటుంటారు. అలా చాలా రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల వారి డీఎన్‌ఏలో జన్యు పరివర్తనం జరుగుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏళ్లుగా పరిశోధనలు జరిపారు.

Astronauts Cancer Risk
Astronauts Cancer Risk : వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటుంటారు. అలా చాలా రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల వారి డీఎన్‌ఏలో జన్యు పరివర్తనం జరుగుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏళ్లుగా పరిశోధనలు జరిపారు.
NASA: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు రెండ్రోజుల్లో నలుగురు వ్యోమగాములు
జన్యుపరివర్తనాల కారణంగా వ్యోమగాములు సులువుగా క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని తెలిసింది. వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్న రేడియేషన్ బారిన పడటం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అలాగే నాడీ కణ వ్యవస్థ బలహీనపడి, కణాలు త్వరగానే నాశనం అవుతాయని తెలిపారు.