Breast Cancer : బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయంచేసే తేనెటీగల విషం..ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశోధనల్లో వెల్లడి

రొమ్ము క్యాన్సర్ ను నయం చేసే ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయంచేసే ఔధనం తేనెటీగల విషంలో ఉందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశోధనల్లో వెల్లడైంది.

Breast Cancer : బ్రెస్ట్  క్యాన్సర్‌ను నయంచేసే తేనెటీగల విషం..ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరిశోధనల్లో వెల్లడి

Honeybee Venom Can Cure Breast Cancer

Updated On : February 24, 2022 / 5:52 PM IST

honeybee venom can cure breast cancer : రొమ్ము క్యాన్సర్‌.మహ్మారికి ఎంతోమంది బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 శాతం కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని WHO 2021 ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వ్యాధి అత్యంత సాధారణంగా వ్యాపిస్తున్న క్యాన్సర్‌గా మారిందని WHOలో క్యాన్సర్ స్పెషలిస్టుగా పనిచేస్తున్న ఆండ్రీ ఇల్బవీ తెలిపారు. అంటే రొమ్ము క్యాన్సర్ అనేది ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. దీనికి మందులే లేవా?అంటే ఉన్నాయని చెబుతోంది ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన. రొమ్ము క్యాన్సర్ ను నయం చేయవచ్చని..తేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే విషమే ఔషధం అన్నమాట. పాము విషాన్ని కూడా పలు ఔషధాలలో ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమంలోతేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్ ను నయం చేయవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Also read : కేన్సర్ డే : గుర్తిద్దాం..జయిద్దాం

తేనెటీగల విషం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేసే కొత్త అధ్యయనంలో వెల్లడయ్యింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లోని శాస్త్రవేత్తలు 300 కంటే ఎక్కువ తేనెటీగలు, బంబుల్బీల విషాన్ని పరీక్షించారు. తేనె టీగలలోని ట్రిపుల్ నెగటివ్, హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 (HER2) కలిగిన ఈ విషంలోని సమ్మేళనం ఇతర కణాలకు ఏమాత్రం హాని కలిగించకుండా, ఒక గంటలోపు రొమ్ము క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకు చేసే క్యాన్సర్ చికిత్సల వల్ల క్యాన్సర్ కణాలను నియంత్రించే క్రమంలో ఇతర కణాలకు కూడా హాని కలుగుతోంది. కానీ తాజాగా చేసిన పరిశోధనలో ఇతర కణాలకు హాని కలిగించకుండనే కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే అంతం చేసే ఔషధం తేనెటీగల విషంలో ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Also read : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..
కీమోథెరపీ మందులతో కలిపి దీనిని ఉపయోగించినప్పుడు చక్కని ఫలితాలను వచ్చాయని ఈ పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పరీక్షలు ల్యాబ్ సెట్టింగ్‌లో మాత్రమే జరిగినప్పటికీ, రొమ్ము క్యాన్సర్‌కు చికిత్సగా ఈ సమ్మేళనాన్ని కృత్రిమంగా పునరుత్పత్తి చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీని గురించి మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు డాక్టర్ మారిలెనా టౌరో మాట్లాడుతూ.. ఈ నూతన చికిత్సా విధానం ఆచరంచటానికి ఉపయోగకరమైన చికిత్సగా మారడానికి ముందు మరికొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Also read : Breast Cancer Vaccine: రొమ్ము క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ..మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..

ఈక్రమంలో డాక్టర్ మారిలెనా టౌరో ఓ శుభవార్త చెప్పారు. అదేమంటే..క్యాన్సర్ వ్యాధి పెరుగుదల, దాని వ్యాప్తికి కారణమయ్యే రొమ్ము క్యాన్సర్ కణాలలో మెలిటిన్ సిగ్నలింగ్ మార్గాలకు అంతరాయం కలిగిస్తుందని మా పరిశోధనలో వెల్లడి అయ్యిందని ఆమె తెలిపారు. ల్యాబ్ లేదా జంతు నమూనాలలో క్యాన్సర్ కణాలను చంపడంలో ఈ సమ్మేళనాల ప్రయోగం విజయవంతమయ్యిందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఆ నూతన ఆవిష్కరణలు బాధితుల వరకూ చేరేందుకు చాలా సంవత్సరాలు పడుతుందని..కానీ దీన్ని సాధ్యమైనంత వరకు బాధితులకు చేరేలా కృషి చేస్తున్నామని మారిలెనా టౌరో తెలిపారు.

Also read : cancer Medicine : ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్‌ మందు..అధికారికంగా గుర్తించిన అమెరికా ఎఫ్‌డీఏ