కార్లు, తేలికపాటి వాహనాలకు ఆటోమేటిక్ బ్రేకులు..!

కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు తప్పనిసరిగా ’ఆటోమేటెడ్ బ్రేకింగ్ సిస్టం’ను అమర్చాల్సిందేనని 40 దేశాలు తీర్మానించాయి.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 03:01 PM IST
కార్లు, తేలికపాటి వాహనాలకు ఆటోమేటిక్ బ్రేకులు..!

కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు తప్పనిసరిగా ’ఆటోమేటెడ్ బ్రేకింగ్ సిస్టం’ను అమర్చాల్సిందేనని 40 దేశాలు తీర్మానించాయి.

జెనీవా : వాహనాలలో సాధారణంగా డ్రైవరే బ్రేకులు వేస్తాడు. అలాకాకుండా వాహనాలకు ఆటోమేటిక్ గా బ్రేకులు పడనున్నాయి. ఇకపై కార్లు, తేలికపాటి వాహనాలకు ఆటోమేటిక్ బ్రేకులు రానున్నాయి. కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలకు తప్పనిసరిగా ’ఆటోమేటెడ్ బ్రేకింగ్ సిస్టం’ను అమర్చాల్సిందేనని 40 దేశాలు తీర్మానించాయి. ఇందుకు సంబంధించిన విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇకపై ఆయా దేశాల్లో విక్రయించే కొత్త వాహనాలకు ఈ సాంకేతికతను అమర్చుతారని, వచ్చే ఏడాదిలో వీలైనంత త్వరగా ఇది అమలవుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అయితే భారత్, చైనా, అమెరికా మాత్రం ఇందులో భాగం కాకపోవడం గమనార్హం.