కరోనా ఉధృతి : వారం రోజులు బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

 గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా ఉధృతి :  వారం రోజులు బంగ్లాదేశ్ లో లాక్ డౌన్

Bangladesh

Updated On : April 3, 2021 / 1:58 PM IST

Bangladesh   గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-5నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బంగ్లాదేశ్ రవాణశాఖ మంత్రి ఒబైదుల్ ఖాదర్ శనివారం తెలిపారు.

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్క ఆఫీసు,కోర్టు మూసివేయబడతాయని కానీ పరిశ్రమలు మరియు మిల్లుకు మాత్రం యధావిధాగా కార్యకలాపాలు కొనసాగిస్తాయని మరో మంత్రి ఫర్హాద్ హొస్సేన్ తెలిపారు. మిల్లులు,పరిశ్రమలు కనుక లాక్ డౌన్ సమయంలో మూసివేస్తే..అప్పుడు అందులో పనిచేసే కార్మికులు తమ పనిప్రదేశాలను వదిలి ఇళ్లకు వెళ్లే అవకాశముందని,అప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు. మరికొద్ది గంటల్లోనే లాక్ డౌన్ కి సంబంధించిన నిబంధనలు,సూచనలను ప్రభుత్వం ప్రకటించనుందని తెలిపారు.

అంతకుముందు, సోమవారం..దేశవ్యాప్తంగా కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్నందున అధికంగా ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రాంతాల్లో అన్ని బహిరంగ సభలను నిషేధించడంతో సహా, 18 పాయింట్లతో కూడిన ఆదేశాలని ప్రధాన మంత్రి కార్యాలయం జారీ చేసింది. సామాజిక, రాజకీయ మరియు మతపరమైన సహా అన్ని రకాల కార్యక్రమాలలో సమావేశాలను పరిమితం చేయాలని గెజిట్ నోటిఫికేషన్‌లో కోరింది.

కాగా,బంగ్లాదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య  6లక్షల 24వేల 594కి చేరింది. ఇందులో 5లక్షల 47వేల 411మంది కోలుకున్నారు. 9వేల 155మంది కోవిడ్ తో మరణించారు.