Ajay Banga : మరో కీలక పదవి.. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు

Ajay Banga : మరో కీలక పదవి.. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారతీయుడు

Updated On : February 23, 2023 / 11:30 PM IST

Ajay Banga : అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభిస్తున్నాయి. ఇండియన్స్ శక్తి సామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది. ఇప్పటికే పలువురు భారత సంతతి వ్యక్తుల్లో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును సూచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

Also Read..EU: టిక్‌టాక్‌ యాప్ డిలీట్ చేయాలంటూ ఉద్యోగులకు ఈయూ ఆదేశాలు

63 ఏళ్ల అజయ్ బంగా మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వ్యాపార, ఆర్థిక రంగంలో ఆయనకు 30 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మాస్టర్ కార్డ్ తో పాటు అమెరికన్ రెడ్ క్రాస్, క్రాఫ్ట్ ఫుడ్స్, డౌ ఐఎన్సీ సంస్థల్లో కీలక పదవుల్లో కొనసాగారు.

Also Read..Gunmen Kills 7 : బాబోయ్.. నవ్వారని, ఏడుగురిని కాల్చి చంపేశారు.. వీడియో వైరల్

ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుకు నడిపించడానికి అజయ్ బంగా చాలా అవసరం అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.