ట్రంప్‌ను కలిసిన వ్యక్తికి కరోనా

ట్రంప్‌ను కలిసిన వ్యక్తికి కరోనా

Updated On : March 12, 2020 / 5:05 PM IST

ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ ప్రభుత్వాధికారికి కరోనా సోకినట్లు గుర్తించారు. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలో ఉన్న రిసార్ట్‌లో ఆ వ్యక్తితో కలిసి దిగిన ఫొటో వైరల్ అయింది. ట్రంప్‌ను కలిసిన కొద్ది రోజుల తర్వాతే ఆ 35ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అయినట్లు తెలిసింది. COVID-19 కారణంగా ప్రపంచ దేశాల్లో మృతులు పెరిగిపోతుండటంతో WHO మహమ్మారిగా ప్రకటించేసింది. 

కరోనా వ్యాప్తి కాకుండా ఉండాలని పరాయి దేశాలతో రాకపోకలను ఆపేశాయి ప్రపంచ దేశాలు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్.. గురువారం మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఇరుక్కుపోయిన 6వేల మంది భారతీయుల పరిస్థితి గురించి విచారం వ్యక్తం చేశారు. 

భారత దేశ వ్యాప్తంగా 75కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా రద్దు చేసేసింది బీసీసీఐ. ముంబైలో మార్చి 29 నుంచి జరగాల్సి ఉన్న ఈ టోర్నీకి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తే వ్యాప్తి జరగకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన గుంపు కారణంగానే భారత్‌లో వైరస్ వేగవంతం అయింది.