Brazil : సెల్ ఫోన్‌తో పాటు ఆమె మనసు దోచుకున్న దొంగ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రేమ కథ

ఆన్ లైన్ ప్రేమలు, సెల్ ఫోన్ ప్రేమలు చూసాం.. అయితే తన సెల్ ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడింది ఓ యువతి. రెండేళ్లుగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారట. ఈ వింత లవ్ స్టోరీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Brazil : సెల్ ఫోన్‌తో పాటు ఆమె మనసు దోచుకున్న దొంగ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రేమ కథ

Brazil

Brazil : లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు.. లేకపోతే తన ఫోన్ దొంగిలించిన దొంగని ఓ యువతి లవ్ చేయడం ఏంటి? విచిత్రంగా అనిపించినా ఆ సెల్ ఫోన్ దొంగతో రెండేళ్లుగా ఆ యువతి ప్రేమలో ఉంది. ఈ వింత లవ్ స్టోరీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Indo-Pak couples love stories : భారత్-పాక్ జంటల ప్రేమ కథల్లో ట్విస్ట్…సీమా హైదర్, అంజూల ప్రేమ బాగోతాలు

బ్రెజిలియన్ యువతి తన ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో పడింది. వారి వింత కథ వైరల్ అవుతోంది. వాళ్లిద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. తమ కూతురు ఫోన్ దొంగిలించిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ఆ యువతి తల్లిదండ్రులకు తెలుసునో.. లేదో అనేది స్పష్టం కాలేదు. తాను నివాసం ఉండే స్ట్రీట్ నుంచి వెళ్తుంటే దురదృష్టవశాత్తు తన ఫోన్‌ను దొంగ ఎత్తుకెళ్లినట్లు యువతి చెప్పింది. ఇక ఆమె ఫోన్ దొంగిలించిన దొంగ  ఫోన్‌లో ఆమె ఫోటో చూసి  ప్రేమను పెంచుకున్నాడట. ఇద్దరికి పరిచయం జరిగి ప్రేమగా మారిందట.  ఇప్పుడు ఆమె లేకుండా జీవించలేనని.. ఆమె ఫోన్ దొంగిలించినందుకు బాధపడినట్లు ఆ దొంగ చెప్పడం విశేషం.

Seema,Sachin love story : సీమా, సచిన్ ప్రేమ కథపై సహస్ర సీమాబల్, యూపీ ఏటీఎస్ ఆరా

@BenderEyes అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి ‘మీరు ఆమె ఫోన్‌ను ఆమె హృదయాన్ని దొంగిలించారా?; అని అడిగితే ‘కరెక్ట్’ అని అతను సమాధానం చెప్పాడు. ఇక వీరి ప్రేమ కథను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇలాంటి విపరీతమైన ప్రేమ కథలు బ్రెజిల్‌లో మాత్రమే పుడతాయని కొందరు ఎత్తి చూపారు. మరికొందరు వీరి లవ్ స్టోరీ చాలా అందంగా ఉందని.. ప్రేమ ఏదైనా సాధించగలదు అని అభిప్రాయపడ్డారు. వీరి ప్రేమ కథ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.