Labubu Dolls Stole: బొమ్మల షాప్‌లో భారీ చోరీ.. 7వేల డాలర్ల విలువైన టాయ్స్ దొంగతనం.. ఏంటీ లబుబు డాల్స్, ప్రత్యేకత ఏంటి?

స్టోర్ లోని ఫుటేజ్ ని పరిశీలించగా.. చోరీకి వచ్చిన వారిలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారు. హూడీలు, ముఖాలను కప్పుకునే దుస్తులు ధరించి లోపలికి చొరబడ్డారు.

Labubu Dolls Stole: బొమ్మల షాప్‌లో భారీ చోరీ.. 7వేల డాలర్ల విలువైన టాయ్స్ దొంగతనం.. ఏంటీ లబుబు డాల్స్, ప్రత్యేకత ఏంటి?

Updated On : August 11, 2025 / 10:57 AM IST

Labubu Dolls Stole: లాస్ ఏంజిల్స్‌లోని ఒక బొమ్మల దుకాణంలో దొంగలు పడ్డారు. భారీ చోరీకి పాల్పడ్డారు. వేల డాలర్ల విలువైన లబుబు బొమ్మలను దొంగిలించారు. డిమాండ్ ఉన్న కలెక్షన్స్ ను లక్ష్యంగా చేసుకుని దొంగతనం జరిగిందని షాపు యజమానులు తెలిపారు.

లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ విభాగం ప్రకారం లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌కు తూర్పున 18 మైళ్ల (29 కిలోమీటర్లు) దూరంలో ఉన్న లా పుయెంటేలోని వన్ స్టాప్ సేల్స్‌లో తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగింది. దొంగతనం చేయడానికి నిందితులు దొంగిలించబడిన టయోటా టకోమాను ఉపయోగించారు.

”దొంగలు లాబుబస్ టాయ్స్ ను టార్గెట్ చేశారు. స్టోర్ కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాను పరిశీలించారు. స్టోర్ లో ఏం స్టాక్ ఉన్నాయో చూసుకున్నారు. ఆ తర్వాత చోరీకి పాల్పడ్డారు. చాలా దొంగిలించబడ్డాయి. దాదాపు 30వేల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం విలువైనవి చోరీ అయి ఉండొచ్చు. మేము ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాము” అని స్టోర్ కో ఓనర్ జొన్నా అవనాడో వాపోయారు.

స్టోర్ లోని ఫుటేజ్ ని పరిశీలించగా.. చోరీకి వచ్చిన వారిలో కనీసం నలుగురు వ్యక్తులు ఉన్నారు. హూడీలు, ముఖాలను కప్పుకునే దుస్తులు ధరించి లోపలికి చొరబడ్డారు. అల్మారాల్లో వెతికారు, పెట్టెలను బయటకు తీశారు. ఈ చోరీతో స్టోర్ నిర్వాహాకులు షాక్ లో ఉన్నారు. అనుమానితులను గుర్తించడంలో సాయం చేయాలని ప్రజలను కోరారు. దొంగిలించబడిన బొమ్మల రిటైల్ విలువ సుమారు 7వేల డాలర్లుగా అంచనా వేశారు. అందులో కొన్ని బొమ్మల ధర ఒక్కొక్కటి 500 డాలర్లుగా ఉంది.

లబుబు అనేది హాంగ్ కాంగ్‌లో జన్మించిన కళాకారుడు కాసింగ్ లంగ్ సృష్టించిన, చైనీస్ కలెక్టబుల్ బ్రాండ్ పాప్ మార్ట్ నిర్మించిన ఒక ప్రసిద్ధ డిజైనర్ బొమ్మ పాత్ర. కొంటె చిరునవ్వు, పెద్ద కళ్ళు, పదునైన దంతాలకు ప్రసిద్ధి చెందిన లబుబు, వివిధ విచిత్రమైన దుస్తుల సిరీస్‌లలో వస్తుంది. తరచుగా బ్లైండ్-బాక్స్ కలెక్షన్లలో భాగంగా విడుదల అవుతుంది.

2015లో నార్డిక్ పురాణాల నుండి ప్రేరణ పొందిన మూడు చిత్రాల పుస్తకాలలో కొంటె, సూటి చెవులు, పదునైన దంతాల రాక్షసులుగా మొదటిసారిగా పరిచయం చేయబడిన లబుబు, ఆర్ట్ టాయ్ ప్రియులలో కల్ట్ హోదాను పొందింది. దాని విచిత్రమైన, వింతైన, అందమైన ప్రదర్శన బ్లాక్‌పింక్ నుండి రిహన్న, లిసా వంటి ప్రముఖులను ఆకర్షించింది. భారత్ లో అనన్య పాండే, శిల్పా శెట్టి, ఊర్వశి రౌతేలా వంటి తారలు ఈ ట్రెండ్‌లో చేరారు.

పరిమిత ఎడిషన్ విడుదల, అధిక డిమాండ్ లబుబును స్పెషల్ గా మార్చాయి. ఈ ప్రత్యేకతలు పాప్ మార్ట్ అమ్మకాలను కొత్త శిఖరాలకు చేర్చాయి. 2024లో ఖరీదైన బొమ్మల నుండి వచ్చే ఆదాయం 1,200 శాతానికి పైగా పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: చెత్తను తిని స్వచ్ఛమైన బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియా.. ఇదెలా సాధ్యం.. దీన్నెవరు కనుగొన్నారంటే..