వారి వయస్సు 1042 ఏళ్లు : గిన్నిస్ బుక్ రికార్డుకెక్కిన 12మంది సోదర సోదరీమణులు

Canada 12 siblings win Guinness World Record for highest combined age : 12మంది సంతానం కలిగిన ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు అన్నదమ్ములు గిన్నీస్ రికార్డుకెక్కారు. వారిని చూస్తే దేవుడి దీవెనలన్నీ ఈ కుటుంబానికే ఉన్నాయా? అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లది 1042 ఏళ్ల వయస్సు. అంటే ఒక్కొక్కరికి అంత వయస్సు ఉందని కాదు. ఆ 12మంది సంతానంలో పెద్ద వారికి ఇప్పుడు 97ఏళ్లుగా ఉండగా..అందరిలోకి చిన్నవారి వయస్సు 75 ఏళ్లు కావటం విశేషం.
కెనాడాలో పుట్టిన వీళ్లంతా ఇప్పుడు వారి వారి ఉద్యోగాల రీత్యా వేరే దేశాలకు వెళ్లిపోయి సెటిల్ అయిపోయారు. కానీ ప్రతీ సంవత్సరం మూడు సార్లు ఒకేచోట కలుస్తుంటారు. కానీ ఈ 2020 కరోనా మహమ్మరి వీరి కలయికను అడ్డుకుంది. దీంతో వీళ్లంతా వీరి సమావేశాలు వాయిదా పడ్డాయి. వీళ్ల ఇంటి పేరు డీక్రజ్. దీంతో వీళ్లను లోకల్‌గా ‘డీక్రజ్ తోబుట్టువులు’ అని పిలుస్తుంటారు.
కెనాడాకు చెందిర ఈ 12మంది ఒకే తల్లిబిడ్డలు.ఈ 12మందిలో తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. అందరికంటే పెద్ద సంతానం అయినా 97ఏళ్ల వయస్సు నుంచి అందరికంటే చిన్నవారైన 75ఏళ్ల వ్యక్తి వరకూ ఇప్పటి వరకూ అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉండటం మరో విశేషం. వీళ్లంతా ఇప్పటి వరకూ మాంచీ ఉత్సాహంగా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు.
ప్రస్తుతానికి ‘ఈ భూమండలంపై జీవించి ఉన్నవారిలో సహోదరీ సహోదరులందరి వయసునూ కలుపుకుని 1042 ఏళ్ల వయసు కలిగిన వారిగా’ గిన్నిస్ బుక్‌లోకీ ఎక్కారు. ఆ సందర్భంగా ఈ అపూర్వ సహోదరీ సహోదరులంతా చిరునవ్వులు చిందిస్తూ ఒక గ్రూప్ ఫొటో తీయించుకున్నారు.
వీళ్లది కెనడాయే అయినా ఉద్యోగాల రీత్యా వేరే వేరే దేశాలకు వెళ్లిపోయి అక్కడే కుటుంబాలతో సెటిల్ అయిపోయారు. వేర్వేరు దేశాల్లో ఉన్నాగానీ డిసెంబర్ 15న తమ కోసం గిన్నిస్ వాళ్లు వస్తున్నారంటే కెనడాలోని వారి పుట్టింటికి చేరుకున్నారు. లోకల్‌గా వీళ్లకు ‘డీక్రజ్ తోబుట్టువులు’ అని పేరొందినీ ఈ సహోదరీ సహోదరులు అంటే తెలియనివారుండరు. ఈ డీక్రజ్ తోబుట్టువులు మూడేళ్లకోసారి సెలవులకు వీరంతా కలుస్తుంటారట.
ఈ 12మంది తోబుట్టువుల పేర్లు డోరీన్ లూయిస్ (23 సెప్టెంబర్ 1923 న జన్మించారు), పాట్రిక్ డి క్రజ్ (30 సెప్టెంబర్ 1925) జెనీవీవ్ ఫాల్కావో (4 జూలై 1927) జాయిస్ దేసౌజా (2 మార్చి 1929) రోనాల్డ్ డి ‘క్రజ్ (జననం 24 ఆగస్టు 1930), బెరిల్ కాండిలాక్ (26 ఆగస్టు 1932) జో డి క్రజ్ (1 జూన్ 1934) ఫ్రాన్సిస్కా లోబో (17 సెప్టెంబర్ 1936) ఆల్తీయా పెకస్ (27 జూలై 1938) తెరెసా హెడింగర్ (జననం 9 జూన్ 1940), రోజ్మరీ దేసౌజా (జననం 30 మార్చి 1943), యూజీనియా కార్టర్ (24 అక్టోబర్ 1945 న జన్మించారు).
ఈ సందర్భంగా 91 ఏళ్ల జాయిస్ దేసౌజా అనే ఓ సోదరి మాట్లాడుతూ.. మా తల్లిదండ్రులు పాకిస్థాన్ లోని కరాచీకి చెందినవారని తెలిపారు. మా అమ్మా నాన్నల పేర్లు మైఖేల్, సిసిలియా అని..మా కటుంబం ఎప్పుడో పాకిస్థాన్ నుంచి కెనాడాకు వచ్చి సెటిల్ అయిపోయామని తెలిపారు. ఇప్పుడు మా 12మంది యూఎస్ ఏ, కెనడా,స్విట్జర్లాండ్ వంటి పలు దేశాల్లో సెటిల్ అయ్యామని..కానీ ఇప్పటి వరరూ మా తల్లిదండ్రులకు పుట్టినవారిలో ఇంత వరకూ అందరూ జీవించి ఉండటం చాలా చాలా సంతోషమనీ పైగా మేమందరం పూర్తి ఆరోగ్యంతో ఉండటా ఇంకా సంతోషంగా ఉందని తెలిపారు.