బయటపడ్డ 57,000 ఏళ్ల నాటి తోడేలు పిల్ల మృతదేహం : చెక్కు చెదరలేదు..బొచ్చు కూడా ఊడలేదు

Canada 57000 years ago Ancient Wolf : అడవుల్లో తిరిగే జంతువులు చనిపోతే వాటి కళేబరాలు నేలలో కుళ్లిపోతాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ తోడేలు పిల్ల మృతదేహం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఆ తోడేలు పిల్ల కళేబరాన్ని గుర్తించిన సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఇన్ని వేల ఏళ్ల తరువాత కనీసం ఎముకలు లభ్యం కావటం కూడా కష్టం..అటువంటిది కళేబరం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటాన్ని తాజాగా పరిశోధకులు గుర్తించారు.
ఏ జంతువైనా చనిపోయిన తరువాత వాటి మృతదేహాలు నేలలో కుళ్లిపోతాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ, చెక్కు చెదరకుండా ఉన్న తోడేలు పిల్ల కళేబరాన్ని గుర్తించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. బంగారు గనిలో పని చేస్తున్న ఓ తోడేలు పిల్ల మృతదేహం కనిపించింది. ఆ విషయం కాస్తా ఆనోటా ఈనోటా పరిశోధకులకు తెలిసింది. దీంతో వెంటనే ఆ తోడేలు పిల్ల కళేబరం లభ్యం అయిన ప్రాంతానికి వచ్చారు. అనంతరం దానిపై పరిశోధనలు చేసినవాళ్లు పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆ తోడేలు పిల్ల ఆడదని..అది 57,000 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండవచ్చని తేల్చారు.
కెనడాలోని యుకాన్ ప్రాంతంలో ఒక గుహలో ఉండగా, అది కూలిపోయి అది చనిపోయి ఉండవచ్చని..మంచు గుహ కూలిన తరువాత ఆ తోడేలు పిల్ల మృతదేహం గడ్డకట్టిపోయింది. దీంతో అప్పటినుంచి అది అన్ని వేల ఏళ్లైనా అలాగే వేల సంవత్సరాలు గడిచినా ఏమాత్రం చెడిపోకుండా.. చెక్కుచెదరకుండా ఉందని తెలిపారు.
ఈ విషయంపై జైలీ మిచెన్ అనే సైంటిస్టు మాట్లాడుతూ..తోడేలు కణజాలాలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయని..దాని బొచ్చు కూడా ఊడిపోలేదని తెలిపారు. కానీ దాని కళ్ళు మాత్రం కనిపించలేదని వెల్లడించారు. ఆ తోడేలు పిల్ల మృతదేహానికి ‘జుర్’ అనే పేరు పెట్టారు.
ఏ జంతువు కళ్లైనా చాలా మృదువుగా ఉంటాయి. అందుకే జంతువైనా మనిషైనా చనిపోగానే కళ్లు చాలా త్వరగా పాడైపోతాయి. పరిశోధకులు తోడేలు అస్థిపంజరాన్ని ఎక్స్ రే ద్వారా పరిశీలించారు. దాని బొచ్చు, దంతాలకు ఉండే ఎనామిల్ నమూనాలను పలు కోణాల్లో విశ్లేషించారు. దీని ద్వారా మంచుయుగం నాటి పరిస్థితుల్లో భూమి, ఆనాడు జీవించిన తోడేళ్లు ఎలా ఉండేవో విశ్లేషించటానికి తమ పరిశోధనల్ని కొనసాగిస్తున్నారు.
చనిపోయేనాటికి తోడేలు పిల్ల బరువు 105పౌండ్లు ఉందనీ..పొడవు ఒక అడుగు ఉందని తెలిపారు. చనిపోయేలానికి ఆ తోడేలు పిల్ల కేవలం ఏడు వారాల వయసు ఉండవచ్చని తెలిపారు. దాని దంతాల ఎనామిల్‌ను విశ్లేషించినప్పుడు పరిశోధకులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ఆనాటి తోడేళ్లు నది సమీపాల్లో జీవించేవనీ..అవి సాల్మన్ వంటి చేపలను వేటాడి తినేవని గుర్తించారు. జుర్ DNAను ప్రస్తుతం ఉన్న తోడేళ్ల డీఎన్‌ఏతో పోల్చి చూశారు. ఉత్తర అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న తోడేళ్లతో దీనికి సంబంధాలు ఉన్నాయని వారు గుర్తించారు. ఇది అప్పట్లో యూరేషియాలో జీవించిన తోడేళ్ల (grey wolves) కుటుంబానికి చెందినదిగా గుర్తించారు.