కుక్కలు, పిల్లులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

కుక్కలు, పిల్లులు క్వారంటైన్ లో ఉండాల్సిందే

cats-and-dogs

Updated On : February 3, 2021 / 12:42 PM IST

Cats and dogs coronavirus : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. వైరస్ విస్తరించిన దేశం లేదు. మనుషులతో పాటు జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. వైరస్ కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చాయి పలు దేశాలు. భారతదేశంలో రూపొందించిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తోంది. పలు దేశాలకు కూడా వ్యాక్సిన్ ను ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. కరోనా సోకిన వ్యక్తులు తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉండాలనే నిబంధన ఉంది. అలాగే..మనిషికి పెట్టిన నిబంధనలు జంతువులకు కూడా అమలు చేస్తున్నారు.

తాజాగా దక్షిణ కొరియాలో కొత్త ఆంక్షలు అమలు చేస్తోంది. కుక్కలు, పిల్లులకు కరోనా పాజిటివ్ అని తేలితే..ఐసోలేషన్ లో తప్పక ఉండాలని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ ఆదేశించింది. లక్షణాలు కనిపిస్తే..వెంటనేన జంతువులకు కరోనా పరీక్షలు చేయించాలని సూచించింది. పాజిటివ్ అని తేలితే..ఐసోలేషన్ ఉంచాలని వెల్లడించింది. ఇళ్లలో ఐసోలేషన్ కుదరకపోతే…ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఉంచాలని వెల్లడించింది. మొత్తం 14 రోజులు దిగ్భందం చేయాల్సి ఉంటుంది. International Prayer Centreలో పిల్లికి కరోనా వైరస్ సోకిందని గుర్తించారు. దీంతో 100 మందికిపైగా వ్యాధి బారిన పడ్డారని అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం హాంకాంగ్ లో ఓ కుక్క వైరస్ బారిన పడి చనిపోయింది. దీనికి సంబంధించిన విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాన మంత్రి Chung Sye-kyun ఆదివారం అధికారులకు సూచించారు.

దక్షిణ కొరియాలో జంతువులను అధికంగా పెంచుకుంటుంటారు. 50 మిలియన్ల జనాభాలో మూడో వంతు జంతువులను ఇంట్లో ఉంచుకుంటుంటారు. వైరస్ కట్టడికి ఈ దేశం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 78 వేల 844 వైరస్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. వేయి 435 మరణాలు సంభవించాయి. జులైలో ఇంగ్లాండ్ లో ఓ పిల్లి, ఇంట్లో ఉన్న వారు వైరస్ బారిన పడ్డారు. జంతువు ముక్కు కారడం, శ్వాస పీల్చుకోవడంలో బాధ పడుతోంది. యజమానులతో పాటు..ఆ జంతువు పూర్తిస్థాయిలో కోలుకుందని Downing Street వెల్లడించింది. పిల్లులు, కుక్కలకు వ్యాక్సిన్ అవసరమని యునైటెడ్ స్టేట్స్ లోని శాస్త్రవేత్తలు వాదించారు.