భారతీయ విద్యార్ధుల వీసా సమస్యలు పరిష్కరించాలని బ్రిటన్ ను కోరిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2019 / 04:28 AM IST
భారతీయ విద్యార్ధుల వీసా సమస్యలు పరిష్కరించాలని బ్రిటన్ ను కోరిన భారత్

Updated On : October 1, 2019 / 4:28 AM IST

బ్రిటన్ లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల హక్కులు కాపాడాలని, భారతీయ విద్యార్థుల వీసాకి సంబంధించిన ఇష్యూస్ ని తర్వగా పరిష్కరించేలా చూడాలని బ్రిటన్ సర్కార్ ని కోరింది భారత ప్రభుత్వం. రెండు దేశాల మధ్య ద్వైపాక్షి్ చర్చల సమయంలో..యూకే హోమ్ ఆఫీస్ బోర్డర్స్,ఇమ్మిగ్రేషన్,సిటిజన్ షిప్,ఇంటర్నేషనల్ స్ట్రాటజీ డైరక్టర్ జనరల్ గ్లియాన్ విలియమ్స్ కి ఈ మేరకు కేంద్ర హొం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా తెలిపారు.

ఇమ్మిగ్రేషన్, పౌరసత్వానికి వంటి అంశాలకు సంబంధించిన పరస్పర ఆందోళన వంటి అనేక అంశాలపై ఇరు పక్షాలు చర్చించాయని ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ లో రాజకీయ మరియు ప్రెస్ మినిస్టర్ కౌన్సిలర్ గా ఉండే కీరన్ డ్రేక్ తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చలు చాలా బాగా జరిగాయని తెలిపారు.