China Visas : ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు

చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు....

China Visas : ఈ ఏడాది 71,600 మంది భారతీయులకు చైనా వీసాలు

China Visas

Updated On : July 12, 2023 / 9:08 AM IST

China Issues Visas To Indians : చైనా దేశం ఈ ఏడాది భారతీయులకు అత్యధిక వీసాలు జారీ చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. (China Embassy) వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పనుల కోసం భారతీయ పౌరులకు వీసాలు మంజూరు చేశామని ట్వీట్ చేశారు.

18 Safe Cities : దేశంలోనే 18 సురక్షిత నగరాలున్న రాష్ట్రం…ఏదంటే…

చైనా జాతీయుల పట్ల వీసా పరిమితులను త్వరగా ఎత్తివేయాలని చైనా, భారతదేశం మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నాం’’ వాంగ్ జియోజియాన్ మరో ట్వీట్ చేశారు.

UK Warns Citizens : పాకిస్థాన్ దేశానికి వెళ్లొద్దు…పౌరులకు యూకే హెచ్చరిక

2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ 60,000 కంటే ఎక్కువ వీసాలు (71,600 Visas To Indians) జారీ చేసినట్లు మేలో ముందుగా వాంగ్ జియాజియాన్ ప్రకటించారు. మూడేళ్లలో తొలిసారిగా భారత్‌తో సహా విదేశీ పర్యాటకులను దేశంలోకి అనుమతిస్తామని మార్చిలో చైనా ప్రకటించింది.