China-Japan Tensions: ఉన్నవి చాలవన్నట్టు మరో రెండు దేశాల ఫైట్.. చైనా, జపాన్ తగ్గేదేలే.. వీళ్లిద్దరి గొడవ ఏంటంటే..

China-Japan Tensions: అంతర్జాతీయంగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొనబోతుందా.. చైనా ఇప్పటికే ఐరాసకు ఓ లేఖ రాసింది.

China-Japan Tensions: ఉన్నవి చాలవన్నట్టు మరో రెండు దేశాల ఫైట్.. చైనా, జపాన్ తగ్గేదేలే.. వీళ్లిద్దరి గొడవ ఏంటంటే..

China Japan

Updated On : November 24, 2025 / 1:50 PM IST

China vs Japan : అంతర్జాతీయంగా మరో రెండు దేశాల మధ్య యుద్ధం వాతావరణం నెలకొనబోతుందా.. ఇప్పటికే రష్యా, యుక్రెయిన్ దేశాలతోపాటు.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రికత్తలు, అమెరికా టారిఫ్‌ల వార్‌తో అంతర్జాతీయంగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో మరో రెండు దేశాల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైనా, జపాన్ దేశాల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా ఎప్పటినుంచో వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో తైవాన్ పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు సూచించే పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాలపై జపాన్ స్పందించింది. నవంబర్ 7వ తేదీన పార్లమెంటులో జపాన్ నూతన ప్రధాని సనై తకాయిచి మాట్లాడుతూ.. తైవాన్ విషయంలో చైనా నౌకాదళ ముట్టడి, ఇతరత్రా దుందుడుకు చర్యలు జపాన్ సైనికపరమైన జోక్యానికి కారణం కావచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది.

టోక్యా తన హద్దులను దాటిందని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మండిపడ్డారు. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్ విషయంలో సైనిక జోక్యానికి యత్నిస్తామని జపాన్ నేతలు బహిరంగంగా తప్పుడు సంకేతాలు పంపడం సంబంధం లేని విషయాలపై మాట్లాడటం దిగ్భ్రాంతికరం. ఈ వ్యవహారంలో రెడ్ లైన్‌ను జపాన్ దాటే ప్రయత్నం చేస్తుంది. మేం ధీటుగా స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Also Read: Pakistan : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. పారా మిలిటరీ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన..

మరోవైపు.. చైనా ఇప్పటికే ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌కు ఓ లేఖ రాసింది. జపాన్ ప్రధాని తకాయిచి అంతర్జాతీయ చట్టాలను, దౌత్య నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించారని చైనా ఆరోపించింది. ఆ దేశం సాయుధ జోక్యానికి యత్నిస్తే అది దురాక్రమణ చర్యే అవుతుందని, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటామని చైనా స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితికి చైనా రాసిన లేఖపై జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం స్పందించింది. చైనా వాదనలను పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, శాంతి పట్ల జపాన్ నిబద్దత మారలేదని పేర్కొంది.

జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన తరువాత దక్షిణాఫ్రికాలో సనై తకాయిచి మీడియాతో మాట్లాడుతూ.. చైనాతో చర్చలకు జపాన్ సిద్ధంగా ఉందని అన్నారు. మేము తలుపులు మూయడం లేదు. కానీ, జపాన్ ఏం చెప్పాలో స్పష్టంగా చెప్పడం మా విధి అంటూ ఆమె అన్నారు.

అమెరికా తర్వాత జపాన్‌కు చైనా అతిపెద్ద ఎగుమతి మార్కెట్. UN COMTRADE డేటా ప్రకారం.. చైనా 2024లో దాదాపు $125 బిలియన్ల జపనీస్ వస్తువులను కొనుగోలు చేసింది, ప్రధానంగా పారిశ్రామిక పరికరాలు, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించినవి ఉన్నాయి.