అంతరిక్షంలోకి వెళ్లి రాగలిగే స్పేస్ ప్లేన్ చైనా దగ్గర ఉందా?

డ్రాగన్ చైనా ఓ సరికొత్త వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్)ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ వ్యోమనౌకను ఎన్నిసార్లు అయినా తిరిగి వినియోగించుకోవచ్చు.. ఇదొక రహాస్య నౌకగా చెబుతోంది చైనా.. అంతరిక్షంలోకి వెళ్లిన ఈ వ్యోమనౌక ప్రస్తుతం.. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతోందంట. అక్కడే అమెరికాకు చెందిన X-37B స్పేస్ క్రాఫ్ట్‌ను పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చైనా వ్యోమనౌక కొంతకాలం పాటు అదే కక్ష్యలో తిరుగనుందని డ్రాగన్ స్పేస్ సెంటర్ చెబుతోంది..
ఈ నౌకలో అధికారిక రెండర్లకు సంబంధించి ఫొటోలు అందుబాటులో లేవు.. అందుకే ఈ చైనా వ్యోమనౌక ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. ఈ ఏడాది 2020 ప్రారంభంలో ఒక అంతరిక్ష నౌక మిషన్ ప్రారంభం కానుందనే వార్తలు వచ్చాయి. చైనా అంతరిక్ష ఫ్రీలాన్స్ రిపోర్టర్ ఆండ్రూ జోన్స్ ప్రకారం.. అంతరిక్ష పరిశోధన కోసం చైనా ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా ఒక అంతరిక్ష ప్రయోగం చేయనుందని ఆయన వెల్లడించారు.
కొన్ని ఏళ్లుగా చైనా అంతరిక్ష విమానాల కోసం కొన్ని విభిన్న అంశాలను పరిశీలిస్తోందని జోన్స్ అంటున్నారు. 2017 నుంచి చైనా మెయిన్ స్పేస్ కొన్ని రకాల రీయూజవల్ టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ లపై పనిచేస్తోంది. వీటిని ఎలా అంటే అడ్డంగా కూడా ల్యాండింగ్ చేయొచ్చునని ఆయన చెప్పారు.
చైనా ప్రయోగాల విషయంలో చాలా సీక్రెట్ గా ఉంచుతుంది. కానీ ఈ మిషన్‌కు సంబంధించి ఎలాంటి రహస్య సమాచారం బయటకు రాలేదు. వైమానిక దళం ఇప్పటికే ప్రయోగంలో భాగంగా అక్కడి వస్తువులను ట్రాక్ చేస్తోంది. రాకెట్ బయలుదేరిన ఖచ్చితమైన సమయాన్ని ఉపగ్రహ ట్రాకర్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష నౌక స్పేస్ నుంచి భూమిపైకి దిగినప్పుడు ఏం జరుగుతుందో వేచి ఉండాలి. ఈ ప్రయోగం.. చైనా రాష్ట్ర అంతరిక్ష లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
BREAKING NEWS.
New Chinese satellite….uhhh not exactly “just a satellite”….launch. From Jiuquan. Tomorrow. Around 05:30 UTC.
And this one is a BIG one. One that will trigger responses like below after it launches. pic.twitter.com/geoOFKE16A
— Cosmic Penguin (@Cosmic_Penguin) September 3, 2020