పెండ్లికి ముందే గర్భందాల్చారా.. 38వేలు కట్టాల్సిందే.. సహజీవనంకు రూ.6వేలు.. కఠిన నిబంధనలు

China Linkong Village : నైరుతి చైనా యునాన్ ప్రావిన్స్‌లోని లింకాంగ్ గ్రామం పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దీనికి కారణం ఆ గ్రామంలో

పెండ్లికి ముందే గర్భందాల్చారా.. 38వేలు కట్టాల్సిందే.. సహజీవనంకు రూ.6వేలు.. కఠిన నిబంధనలు

China Linkong Village

Updated On : December 28, 2025 / 8:31 AM IST

China Linkong Village : సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతో చైనాలోని ఓ గ్రామం కొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ రూల్స్ తో కూడిన బోర్డును గ్రామ పంచాయతీలో పెట్టింది. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో ప్రస్తుతం ఆ గ్రామం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఊరిలో విధిస్తున్న వింత జరిమానాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వం స్పందించింది. వెంటనే అధికారులు రంగంలోకిదిగి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నిబంధనల బోర్డును తొలగించేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Gold Silver Price : బంగారం, వెండి ధరలు పైపైకి.. అసలు కారణం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..

నైరుతి చైనా యునాన్ ప్రావిన్స్‌లోని లింకాంగ్ గ్రామం పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దీనికి కారణం ఆ గ్రామంలో విధించిన కఠిన నిబంధనలే. సాధారణంగా గ్రామంలో అభివృద్ధి కోసం కొన్ని నియమాలు పెట్టుకుంటారు. గ్రామాన్ని క్లీన్ గా ఉంచేందు, ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కొన్ని రూల్స్ అమలు చేస్తారు. అయితే, లింకాంగ్ గ్రామంలో మాత్రం విచిత్రమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. పెండ్లి, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనలపై విధించిన నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ ప్రజలు పాటించాల్సిన నిబంధనలతో కూడిన బోర్డులనుసైతం గ్రామంలో ఏర్పాటు చేశారు.

గ్రామంలో రూల్స్ ఇవే..
♦ పెండ్లి కాకుండానే కలిసి జీవించే జంటలు (సహజీవనం) ఏటా 500 యువాన్లు (రూ.6,412) ఫైన్ కట్టాలి.
♦ పెండ్లికి ముందు యువతి ప్రెగ్నెంట్ అయితే 3,000 యువాన్లు (రూ.38,472) చెల్లించాల్సి ఉంటుంది.
♦ పెండ్లయిన 10 నెలల్లోపే బిడ్డ పుట్టితే ఆ తల్లిదండ్రులు 3,000 యువాన్లు (రూ. 38,472) జరిమానా కట్టాలి.
♦ వేరే రాష్ట్రంలోని వారిని పెండ్లి చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19,236) చెల్లించాలి.
♦ దంపతులు కొట్లాడుకుని గ్రామ అధికారులను పంచాయితీకి పిలిస్తే భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా 500 యువాన్లు (సుమారు రూ.6,412) చెల్లించాలి.
♦ ఎవరైనా మద్యం మత్తులో గ్రామంలో హల్‌చల్ చేస్తే 3,000 నుంచి 5,000 యువాన్లు (రూ.38,472 నుంచి రూ. 64,120) గ్రామ పంచాయతీకి కట్టాలి.
♦ నిరాధార ఆరోపణలు, నిందలు వేస్తే 500 నుంచి 1,000 యువాన్ల (సుమారు రూ. 6,412 నుంచి రూ.12,824) చెల్లించాలి.

లింకాంగ్ గ్రామానికి సంబంధించిన నిబంధనల బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తరువాత దాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు.