China Spy Ship ‘Yuan Wang 5’ : చైనా నిఘా నౌక వల్ల భారత్ కు ఎటువంటి ప్రమాదం..?
చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ శ్రీలంకలోని హంబన్‌టొట పోర్టులో కొన్ని రోజుల పాటు నిలిపి ఉంటచమంటే..అది కచ్చితంగా భారత్‌ను టార్గెట్ చేయడమే..షిప్ ఒకసారి హంబన్కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.

'spy ship' issue
China Spy Ship ‘Yuan Wang 5’ in Srilanka Port : చైనా నిఘా నౌక దూసుకువస్తున్న చైనాను ఒక్క మాట కూడా గట్టిగా అనలేని పరిస్థితిలో ఉంది శ్రీలంక. ఆపదలో సాయంగా నిలిచిన భారత్‌కు.. కనీసం మద్దతుగా ఉండలేని దుస్థితిలో ఉంది.. అలాంటి సినారియో క్రియేట్ చేసింది చైనా ! శ్రీలంకను అప్పుల్లోకి తోసేసి.. హంబన్‌టొట పోర్టును స్వాధీనం చేసుకుంది. మరి ఇప్పుడు చైనా దూకుడు అడ్డుకోవడం ఎలా.. అసలు యువాన్ వాంగ్ నౌక అంత ప్రమాదం ఎందుకు ?
హంబన్‌టొటలో ఐదు రోజులు యువాన్ వాంగ్ నౌకను ఆపడం అంటే.. అది కచ్చితంగా భారత్‌ను టార్గెట్ చేయడమే ! ఈ షిప్లో 4వందల మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. నౌక మీద భారీ ఆకారంలో పరావలయ ఆకారంలో యాంటిన్నాలు, భారీ సెన్సార్లు ఫిక్స్ చేసి ఉంచుతారు. అంతరిక్షం, శాటిలైట్ కంట్రోల్, పరిశోధన ట్రాకింగ్లను ఈ నౌక ద్వారా నిర్వహిస్తారు. ఈ 400ల మంది సిబ్బందిని.. చైనాకు చెందిన లిబరేషన్ ఆర్మీలోని వ్యూహాత్మక విభాగం నియంత్రిస్తూ ఉంటుంది. అలాంటి షిప్ ఒకసారి హంబన్కు చేరుకుంటే మొత్తం దక్షిణ భారత దేశమంతా దాని నిఘా పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇదే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ఐతే భారత వర్గాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయ్.
ఆర్థిక సంక్షోభం విలవిల్లాడుతోన్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ఎంత చేయాలో అంతా చేసింది.. చేస్తోంది కూడా ! ఐనా సరే.. ఇప్పుడు భారత్‌కు సపోర్టుగా నిలవలేని పరిస్థితి లంకది! వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో హంబన్‌టొట పోర్టు అత్యంత కీలకం. ఈ నౌకాశ్రయాన్ని చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని నిర్మించారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో హంబన్‌ను చైనా మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్‌కు లీజుకు ఇచ్చింది. దీంతో డ్రాగన్ కంట్రీ.. ఈ పోర్టును సైనిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశముందనే ఆందోళనలు మొదలయ్యాయ్. ఇప్పుడు యువాన్ వాంగ్ రాకతో అదే ప్రూవ్ అవుతోంది కూడా !
Also read : China Spy Ship in Srilanka Port : భారత్ పై చైనా మరో భారీ కుట్ర..చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌక
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి రుణం కోసం శ్రీలంక ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో చైనా నుంచి క్లియరెన్స్‌తో పాటు సపోర్టు లంకకు అవసరం. అందుకే డ్రాగన్‌ను డైరెక్ట్‌గా వ్యతిరేకించలేని పరిస్థితి. అందుకే ఇంధనం నింపుకునేందుకు మాత్రమే నౌక వస్తుందని లంక పదేపదే చెప్తున్నా.. డ్రాగన్ మాత్రం కుట్రకు సిద్ధం అయిందని క్లియర్‌గా అర్థం అవుతోంది. ఈ నౌక
విషయంపై శ్రీలంక ప్రభుత్వానికి భారత్ తన ఆందోళనను తెలియజేసింది. ఇక అదే సమయంలో సీనియర్ అధికారులు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నారు. ఐతే భారత్ ఆందోళలను చైనా కొట్టి వేస్తున్నా.. డ్రాగన్‌ను పూర్తిగా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
.
హంబన్‌టొట నౌకాశ్రయాన్ని 99ఏళ్లకు చైనా లీజ్‌కు తీసుకుంది. ఈ పోర్టును అభివృద్ధి చేయడం వెనక చైనా భారీ కుట్ర చేస్తుందన్నది క్లియర్. హంబన్‌ను మల్టీపర్పస్‌గా వాడుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది. పొద్దంతా వ్యాపారానికి.. రాత్రికి గూఢచర్యానికి ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. ఇక అటు హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. దీనికోసం హంబన్లోనే కాదు.. కెన్యాలో లామూ పోర్టు, టాంజానియోలో డారే సలాం పోర్టు, పాకిస్థాన్‌లో గ్వాదేర్ పోర్ట్, కరాచీ డీప్ వాటర్ టెర్మినల్, బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్ట్, మయన్మార్‌లో చాక్షు పోర్ట్.. ఇలా తమ డబ్బుతోనే చైనా ఈ నౌకాశ్రయాలను నిర్మించుకుంది. ఈ పోర్టులన్నీ హిందూమహసముద్ర ప్రాంతంలోనే ఉన్నాయ్. ఇక ఇప్పుడు హంబన్‌ను భారత్ మీద నిఘా కోసం చైనా ఉపయోగించుకునేందుకు సిద్ధం అయింది.