కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు ఒప్పుకున్న చైనా

చైనా ఆర్మీ తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు నిర్థారించింది. లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో జూన్ 15న లడఖ్ లో జరిగిన ఘర్షణల్లో తమ కమాండింగ్ ఆఫీసర్ చనిపోయినట్లు చైనా ఆర్మీ ప్రకటించింది. ఘర్షణ తర్వాత తమ వైపు ప్రాణ నష్టం జరిగిందని చైనా ఒప్పుకుంది ఇదే తొలిసారి. ఈ ఘటనలో ఇండియా సైనికులు 20మంది చనిపోయారు. ఆర్మీ వర్గాల ఆధారంగా 45మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం.
గల్వాన్ నది హిమాలయాల నుంచి 15అడుగుల లోతులో ఉంటుంది. ఘర్షణ జరిగిన సమయంలోనూ గల్వాన్ ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.